జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత సంబురాలు ఘ‌నంగా…..

8Aug 2017

జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత సంబురాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌కు హాజ‌ర‌యిన మంత్రి కేటీఆర్.. ఈ సంద‌ర్భంగా చేనేత‌ వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌నను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ప్ర‌తి ఒక్క‌రు చేనేత వ‌స్త్రాలు ధ‌రించాల‌ని పిలుపునిచ్చారు. చేనేత‌ను ప్రోత్స‌హించేలా అంద‌రితో మంత్రి ప్ర‌తిజ్ఞ చేయించారు. దేశంలో వ్య‌వ‌సాయ రంగం త‌ర్వాత ఎక్కువ మందికి ఉపాధి క‌ల్పిస్తున్న క‌ల్పిస్తున్నది చేనేత రంగ‌మ‌ని మంత్రి తెలియ‌జేశారు. చేనేత కార్మికుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. చేనేత‌కు రూ. 1280 కోట్ల బ‌డ్జెట్ కేటాయించామ‌ని ఆయ‌న చెప్పారు. వీవ‌ర్ జిందాబాద్ పుస్త‌కాన్ని, తెలంగాణ చేనేత మ‌ర‌నేత వైభ‌వ గీతాల సీడీని మంత్రి ఆవిష్క‌రించారు