Telugu Film Actor Vijay Deverakonda met Minister KTR

23Jul 2018

Telugu Film Actor Vijay Deverakonda met Minister Sri KTR & handed over a cheque of ₹ 25 lakh at Camp Office.The actor had auctioned his Filmfare award which he bagged for the film Arjun Reddy.

ముఖ్యమంత్రి సహాయనిధికి విజయ్ దేవరకొండ 25 లక్షల భారీ విరాళం

-తనకు లభించిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసిన హీరో విజయ్
-ఈరోజు మంత్రి శ్రీ కేటీ రామారావు ని కలిసి చెక్కును అందించిన విజయ్ దేవరకొండ కుటుంబం
-తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం, జలం జీవం కార్యక్రమాల్లో పాల్గొనాలని విజయ్ ని కోరిన మంత్రి
-తాజాగా విజయ్ ప్రారంభించిన సొంత బ్రాండ్ తాలూకు వస్త్రాల తయారీనే తెలంగాణలోనే తయారుచేయాలనీ కోరిన మంత్రి

ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ శుక్రవారం మంత్రి శ్రీ కెటి రామారావును బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. తనకు లభించిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తానని ప్రకటించిన విజయ్ దేవరకొండ ఈ మేరకు ఈరోజు 25 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని మంత్రి కేటీ రామారావు కోరారు. తన కుటుంబ సభ్యులతో మంత్రిని కలిసిన విజయ్ ఈమేరకు చెక్కును అందించారు. తొలి ఫిలింఫేర్ అవార్డును వేలంవేసి ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయల భారీ విరాళం అందించిన విజయ్ దేవరకొండను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఒక మొక్కను అందించిన మంత్రి తెలంగాణ ప్రభుత్వ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని విజయ్ ను కోరారు. దీంతోపాటు పురపాలక శాఖ తరఫున చేపట్టిన జలం జీవం కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణం లోనూ పాల్గొని, ఈ అంశం పైన ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని మంత్రి కోరారు. ఈ మేరకు త్వరలోనే జలమండలి అధికారులతో ఒక కార్యక్రమం లో పాల్గొంటానని మంత్రికి విజయ్ దేవరకొండ హామీ ఇచ్చారు.

తాను ప్రారంభించిన రౌడీ క్లబ్ మొబైల్ అప్లికేషన్ వివరాలను ఈ సందర్భంగా మంత్రికి విజయ్ తెలిపారు. ఇందులో భాగంగా అమ్మకాలు జరుపుతున్న వస్త్రాల తయారీనే తెలంగాణలోనే చేపట్టాలని, ఇందుకోసం అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు మంత్రి హామీ ఇచ్చారు. ఈమేరకు నగరానికి దగ్గరలో ఉన్న గుండ్లపోచంపల్లి అపారెల్ పార్కులో ఉన్న వస్త్ర తయారీదారులతో కలిసి పనిచేయాలని సూచించారు. మంత్రి సలహా మేరకు త్వరలోనే ఆయా వస్త్ర తయారీదారులతో సమావేశం అవుతానని విజయ్ దేవరకొండ తెలిపారు.