అద్భుతాలు చేయడానికి బడా బడా పరిశ్రమలేవీ అక్కర్లేదు. భారీ ఎత్తున పెట్టుబడి కూడా అవసరం లేదు. ఓ వినూత్న ఆలోచన..

24Jul 2017

అద్భుతాలు చేయడానికి బడా బడా పరిశ్రమలేవీ అక్కర్లేదు. భారీ ఎత్తున పెట్టుబడి కూడా అవసరం లేదు. ఓ వినూత్న ఆలోచన.. నెరవేర్చుకోవాలన్న సంకల్పం.. నెరవేర్చుకునే అవకాశం .. ఈ మూడూ ఉంటే చాలు.. అనుకున్నది సాధించడం అసాధ్యమేదీ కాదు. ఇప్పుడు యువత ఆలోచనలకు పట్టం కడుతూ హైదరాబాద్‌లోని టీ హబ్‌ అనేక కొత్త ఆవిష్కరణలకు కేంద్రస్థానంగా మారింది. టీ హబ్‌తో పాటు నగరంలో అంకురసంస్థలు పెద్దఎత్తున విస్తరిస్తున్నాయి. విభిన్న ఆలోచనలతో దూసుకొస్తున్న యువత.. తమ కాళ్లపై తాము నిలవడమే గాక… మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అంకుర పరిశ్రమల్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తుండటం శుభ పరిణామం. ఎదురే లేకుండా యువత సత్తా చాటుతున్నారు. ప్రస్తుత ఊపు చూస్తుంటే 2, మూడేళ్లలోనే అంకుర పరిశ్రమల స్థాపనలో భాగ్యనగరం దేశంలోనే ముందుంటుందనే మాట అతిశయోక్తిగా అనిపించడం లేదు