తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం కింద మంత్రి శ్రీ కేటీఆర్ దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు.

8Aug 2021

తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం కింద మంత్రి శ్రీ కేటీఆర్ దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆత్మ సంతృప్తినిచ్చే కార్యక్రమాల్లో భాగంగానే గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాజకీయాల్లో ఒక్కోసారి అనవసర ఖర్చు కూడా చేయాల్సి వస్తుందన్నారు. బ్యానర్లు, హోర్డింగులు పెట్టి ఖర్చు చేస్తాం. దాన్ని తగ్గించుకోవాలన్నదే తన ఆలోచన అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వృథా ఖర్చులు పెట్టొద్దని గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా 100 అంబులెన్స్‌లు పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఈ యేడాది పుట్టినరోజును పురస్కరించుకుని వెయ్యి మోటార్‌ సైకిళ్లను దివ్యాంగులకు అందిస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ నేతలు సైతం స్వతహాగా ముందుకు వచ్చి ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నారన్నారు. త్రిచక్ర వాహనం దివ్యాంగుల జీవనోపాధికి ఉపయోగపడుతుందని మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు శ్రీ శంబిపూర్ రాజు, శ్రీ నవీన్ కుమార్, శ్రీ మాధవరం కృష్ణా రావు, శ్రీ వివేకానంద పాల్గొన్నారు.
May be an image of 4 people, people sitting, motorcycle and scooter
May be an image of 3 people, people sitting and people standing
May be an image of 3 people, people standing and motorcycle
May be an image of 1 person, standing and motorcycle
May be an image of 4 people and people standing
May be an image of 9 people, people sitting, people standing and indoor
May be an image of 5 people, people standing, food and indoor
May be an image of 8 people, people standing, people sitting and indoorMay be an image of 7 people, people sitting, people standing and text that says "Gift Smile PRESENT 3 Wheeler Scooter Distribution For Differently Abled BETTERFUTURE"