నల్గొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్‌ (నార్ముల్)కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి శ్రీ కేటీఆర్ ను కలిశారు.

29Sep 2021

నల్గొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్‌ (నార్ముల్)కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి శ్రీ కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లను మంత్రి అభినందించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో హరిత విప్లవంతో పాటు క్షీరవిప్లవం మొదలైందని, మదర్ (నార్ముల్) డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. ఇప్పటికే విజయ డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలను సైతం అందిపుచ్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారని ఆయన తెలిపారు. అందులో ముఖ్యంగా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ఏర్పడిన రోజు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు విజయ డెయిరీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని, అటువంటి డెయిరీని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
May be an image of 5 people, people standing and indoor
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతా, రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ లతో పాటు శాసనసభ్యులు శ్రీ గాదరి కిషోర్ కుమార్, శ్రీ చిరుమర్తి లింగయ్య, శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, శ్రీ శానంపూడి సైదిరెడ్డి, శ్రీ రవీంద్ర కుమార్, శ్రీ ఫైళ్ల శేఖర్ రెడ్డి, శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, శ్రీ నోముల భగత్, జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి, నార్ముల్ చైర్మన్ శ్రీ గుత్తా జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.