19Sep 2019
మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శనను సందర్శించిన మంత్రి శ్రీ కేటీఆర్. 18 సంవత్సరాలు పైబడి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ఆడ బిడ్డలందరికీ ఈ నెల 23వ తేదీ నుంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు