మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్

15Dec 2018

మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్

* చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.
* పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గురుతరమైన బాధ్యతను అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.
* తెలంగాణ ప్రజల కేసిఆర్ గారిని తమ గుండెల్లో పెట్టుకున్నారు
* రాష్ట్రంలో వచ్చేది శబ్ద విప్లవమే అని ఆనాడే చెప్పిన
* టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా మారుస్తాం

ఇంతటి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అంతేకాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గురుతరమైన బాధ్యతను అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. పార్టీ అధ్యక్షుడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అబలోపేతం దిశగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల కేసిఆర్ గారిని తమ గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే ఇంత పెద్ద విజయాన్ని అందించగలిగారు. రాష్ట్రంలో వచ్చేది శబ్ద విప్లవమే అని ఆనాడే చెప్పిన. టీఆర్ఎస్ పార్టీకి 98 లక్షల మంది తమ ఓటు వేశారు. గెలుస్తామని చెప్పుకున్న కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాకు సమీపంలో కూడా లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఇంత స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు అని తెలిసి కూడా ప్రజలను సర్వేల పేరుతొ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అన్ని సర్వేలు టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్ట బోతున్నారని చెప్పినా ఒక వ్యక్తి చేసిన సర్వేను యావత్ తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురవ్వలేదు. అదేవిధంగా 100 స్థానాల్లో బిజెపి డిపాజిట్ గల్లంతవుతుందని కూడా ఆరోజు చెప్పాను. ఈరోజు 103 స్థానాల్లో బిజెపి తన డిపాజిట్ కోల్పోయింది. అభివృద్ధి విషయంలో ఎవరికీ పట్టం కట్టాలి అన్న విషయంలో తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు.ఈ విజయాన్ని చూసి పొంగి పోకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాను. అన్ని సందర్భాలకు తగ్గట్టుగా, ప్రతీ ఎన్నికలోనూ గెలిచి నిలిచే విధంగా పార్టీని బలోపేతం చేస్తాను.

వచ్చే పార్లమెంటు పంచాయతీ ఎన్నికల్లో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో సీనియర్ నాయకులు సహకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లే దిశలో కృషి చేస్తాను. ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకువెళ్తాము. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. గడిచిన ఎన్నికలను గమనిస్తే ఛత్తీస్ ఘడ్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని చూపించగలిగింది.మిగిలిన రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత ఫలితాలు రాలేదు. కేంద్రంలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించబోతోంది. ప్రజల ఆశీర్వాదంతో 16 పార్లమెంటు స్థానాలు గెలుస్తాం. ఈ దిశగా కేసీఆర్ గారి నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతొ మాతో కలిసివచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తాము. జయశంకర్ సార్ అన్నట్టుగా ప్రజల అభిమానం తో కేంద్రాన్ని శాసించి తెలంగాణ అభివృద్ధిని సాధిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి దేశానికే దిక్సూచిగా మారాయి. మనం సాధిస్తున్న ప్రగతిని చూసి యావద్భారతదేశం గర్వపడుతుంది. ఇదే రకమయిన కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి ఫెడరల్ ఫ్రంట్ దోహదపడుతుంది. దేశ రాజకీయాల్లో గుణాత్మకమయిన మార్పు కోసం టీఆర్ఎస్ చిత్తశుద్దితో సృష్టి చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ లకు బదులుగా ఒక ఫెడరల్ ప్రత్యాన్మాయం దిశగా ముందుకు వెళ్తున్నాం. ప్రత్యాన్మాయలను శోధించి సాదించాలి. ఫెడరల్ ఫ్రంట్ సాధ్యా సాధ్యాల విషయంలో ఒక్కటే చెబుతున్నా.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలయినప్పుడు కూడా ఇదే రకమయిన వాదన తెరమీదకు వచ్చింది. ఆ తరువాత జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా సాధ్యమేనా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ ఏం జరిగిందో మనం అందరం చూశాము. ఫెడెరల్ ఫ్రంట్ విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ దేశంలో గుణాత్మకమయిన మార్పు కోసం ఒక కమిట్ మెంటు తో కలిసి వచ్చే పార్టీలతో కలుపుకొని ముందుకు వెళుతుంది. ఎన్నికల సందర్బాల్లో నేను చెప్పినట్లు ఇది సాధించిన టీఆర్ఎస్ సాధించిన ప్రగతికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన యుద్ధం. ఈ యుద్ధంలో ప్రజలు మేము కేసీఆర్ గారి నేతృత్వంలో సాధించిన ప్రగతికే తమ మద్దతు తెలియజేశారు.

చంద్రబాబుకు కేంద్రంలో చక్రం తిప్పే శక్తి లేదు. కూకట్ పల్లి, శేరి లింగంపల్లిలో కాళ్లకు బలపం కట్టుకొని రాహుల్ గాంధీ, చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ప్రజలు వాళ్ళ మాటలు నమ్మలేదు. టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నీరంతర విద్యుత్తు, ఇంటింటికీ మంచినీరు, మిషన్ కాకతీయతో భూగర్భ జలాలను పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్లడం, గత పాలకుల హయాంలో నత్తలు కూడా సిగ్గుపడే విధంగా సాగిన సాగునీటి ప్రాజెక్టులను బులెట్ వేగంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తున్న సందర్భం మరోవైపు రైతు బందు, రైతు భీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మొదలుయిన సంక్షేమ పథకాలతో ప్రజలకు అన్ని రకాలుగా చేదోడుగా ఉండటం ఇలా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడు గుర్రాలుగా ముందుకు తీసుకు వెళ్తున్న విషయాన్ని ప్రజలు గమనించారు. ఇలాంటి మోడల్ దేశ వ్యాప్తంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ లబ్ది చేకూరాలని, ఒక సుసంపన్నమయిన తెలంగాణ రూపుదిద్దుకోవాలన్న లక్ష్యంతో చేపడుతున్నాం.
మైనార్టీల విషయంలో వారి సంక్షేమం కోసం కేంద్రం 4000 కొల్తు ఖర్చు పెడితే ఒక్క తెలంగాణ రాష్ట్రం 2000 కోట్లు ఖర్చుపెడుతోంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్త శుద్దితో కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పురోగతి కూడా అద్భుతంగా ఉంది. గడిచిన నాలున్నర ఏండ్లలో సరాసరి 17.17 శాతం చొప్పున పురోగతి సాధించాం. ఇప్పుడు సొంత వనరుల పురోగతి విషయంలో 29.04 శాతం నమోదు అయింది. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత సుసంపన్నమో చెప్పడానికి ఈ గణాంకాలే ఉదాహరణ. కేసీఆర్ గారి ఇమేజ్, కార్యకర్తల కృషి ఫలితంగా 75 శాతం సీట్లు సాదించగలిగాం. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు విషయంలో బిల్లు విషయంలో యూపీఏ హయాంలోనే టీఆర్ఎస్ తన మద్దతును తెలియజేసింది. అంతేకాదు కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారితే తప్పకుండా ఈ బిల్లును పాస్ చేస్తాము.

Image may contain: 5 people

Image may contain: 13 people, crowdImage may contain: 3 people, people smiling, people sitting