రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం, కోదురుపాక గ్రామంలో మంత్రి శ్రీ కేటీఆర్ రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు.

16Jun 2021

May be an image of 5 people, people sitting, people standing and indoor
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం, కోదురుపాక గ్రామంలో మంత్రి శ్రీ కేటీఆర్ గారి అమ్మమ్మ, తాతయ్య స్మారకార్ధం తన సొంత ఖర్చుతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, ఎంపీ శ్రీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. నోరుందని ప్రతిపక్షాలు ఎటుబడితే అటు మాట్లాడితే చెల్లదు. రైతులు పండించిన ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వరిధాన్యం పండించడంలో దేశంలోనే నెంబర్‌వన్‌ తెలంగాణ. రైతు వేదికలో నిత్య చైతన్య జ్వాల వెలగాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. రైతుల కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకునేలా రైతువేదికలు ఉపయోగపడాలని’ మంత్రి తెలిపారు.
‘తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్‌మానేరు గుండెకాయలా మారింది. వేములవాడ-మిడ్‌మానేరును కలిపి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా. ఒకప్పుడు సిరిసిల్ల జిల్లా కరువు ప్రాంతం. సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. లాల్‌ బహదూర్‌ శాస్త్రి అకాడమీలో ఈ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. తెలంగాణ తప్పా దేశంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు జరగలేదు. కరోనా కష్టకాలంలో కూడా ధాన్యం కొనుగోలు జరిగిందని’ కేటీఆర్‌ వివరించారు.
No photo description available.