రానున్న రోజుల్లో జంట నగరాలుగా కార్మిక (సిరిసిల్ల) , ధార్మిక ( వేములవాడ) క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ స్పష్టం చేశారు.

26Jul 2021

రానున్న రోజుల్లో జంట నగరాలుగా కార్మిక (సిరిసిల్ల) , ధార్మిక ( వేములవాడ) క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ స్పష్టం చేశారు.
సోమవారం మంత్రి కేటీఆర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో వేములవాడ శాసనసభ్యులు శ్రీ చెన్నమనేని రమేష్ బాబు, నాఫ్స్కాబ్ చైర్మెన్ శ్రీ కొండూరు రవీందర్ రావు, జెడ్పీ చైర్మన్ శ్రీమతి అరుణ, జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే లతో కలిసి జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
May be an image of 2 people, people sitting and people standing
జిల్లాలో వివిధ శాఖల పరిధిలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, తదితర అంశాలపై మంత్రి కూలంకుషంగా చర్చించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మత్తులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులు, పంచాయితీ రాజ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్ పూర్ బ్రిడ్జి కి నిధులు మంజూరు చేయడం జరిగిందని, నిర్మాణ ప్రగతిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. హన్మాజిపేట గ్రామంలో బ్రిడ్జి నిర్మించేలా ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని అన్నారు. వేములవాడలో ప్రగతిలో ఉన్న రెండో బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడలోని తిప్పాపూర్ జంక్షన్ ను అభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు. జిల్లాలోని ఎగువ మానేరు, మధ్య మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్ ల ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను నింపాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలోని 665 చెరువులు వంద శాతం నింపేలా చర్యలు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అందులో 165 చెరువులు పూర్తిస్థాయిలో ఇప్పటికే నింపడం పూర్తయిందని నీటి పారుదల శాఖ అధికారులు మంత్రికి వివరించారు. ప్రతీ మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని నిండాయి అని క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని చెరువులు నింపేలా చూడాలని మంత్రి ఆదేశించారు.
జిల్లాలో ప్రగతిలో ఉన్న 24 చెక్ డ్యాంల నిర్మాణాలను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. అందులో 9 చెక్ డ్యాంల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని మంత్రికి అధికారులు వివరించారు. మిగిలిన 15 చెక్ డ్యాంలను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, అదనంగా అవసరం ఉన్నచోట చెక్ డ్యాంలు నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని మంత్రి ఆదేశించారు.
జిల్లాలో వానాకాలం సాగు వివరాలపై మంత్రి శ్రీ కేటీఆర్ సంబంధిత శాఖ అధికారులను అడిగి ఆరా తీశారు. లక్షా 59 వేల 247 ఎకరాలలో వానాకాలం పంట సాగు చేయడం జరుగుతుందని వ్యవసాయ అధికారులు మంత్రికి వివరించారు.
రైతువేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు ఆయిల్ పామ్, వివిధ రకాల సాంప్రదాయ, సాంప్రదాయేతర లాభదాయక పంటల సాగుపై అవగాహన సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డీసీఎంఎస్ అధికారుల ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు వివిధ రకాల పద్ధతుల గురించి అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లాకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయా లేవా అని మంత్రి ఆరా తీశారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, పోలీస్, వ్యవసాయ శాఖ సమన్వయంతో నకిలీ విత్తనాలు విక్రయించే దుకాణాలపై దాడులు చేసి పీడీ యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రగతిలో ఉన్న 6 వేల పైచిలుకు రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేలా సంబంధిత శాఖల అధికారులు పని చేయాలని మంత్రి ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని తనిఖీలు చేస్తూ నిర్మాణ ప్రగతిలో వేగం పెంచాలని సూచించారు.
ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలలో, పట్టణాలలో ప్రజలకు మౌళిక వసతుల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఒకప్పుడు త్రాగు నీరు, సాగు నీరు, విద్యుత్ సమస్యలు విరివిగా ఉండేవని, ఇప్పుడు ఎక్కడా కూడా ఇలాంటి సమస్యలు లేవని, ప్రత్యక్షంగా ప్రజలే ఈ వాస్తవాలు తెలుపుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూరదృష్టితో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని, దీని ద్వారా త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని మంత్రి అన్నారు. మిషన్ భగీరథలో భాగంగా మిగిలిన తుది దశ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత మిషన్ భగీరథ అధికారులను మంత్రి ఆదేశించారు.
సిరిసిల్ల, వేములవాడ పట్టణాలలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి, అదనంగా అవసరమైన భూ సేకరణ చేసి మోడల్ కాలనీని నిర్మించేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. ఆ దిశగా మున్సిపల్ అధికారులు పని చేయాలని అన్నారు.
May be an image of 1 person, standing and sitting
ధార్మిక, కార్మిక క్షేత్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అన్ని విభాగాల అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆదేశించారు. తద్వారా భవిష్యత్ లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు.
మల్కపేట రిజర్వాయర్ నిర్మాణ పురోగతిని సంబంధిత అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. రిజర్వాయర్ ను త్వరగా పూర్తి చేసేలా చూడాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిని మరోసారి జిల్లాకు ఆహ్వానించి ఆయన చేతులమీదుగా రిజర్వాయర్ ను ప్రారంభిస్తామని తెలిపారు.
భూగర్భ జల శాఖ అధికారులతో అధ్యయనం చేయించి జిల్లాలో ఎన్ని మీటర్ల మేరకు భూగర్భ జలం ఉందని సర్వే చేయించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
విద్యా రంగానికి సంబంధించి ఈ సంవత్సరం నుండే జిల్లాలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. తాత్కాలికంగా అగ్రహారం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ సంవత్సరం నుండి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు. కాలేజీ నిర్మించడానికి స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే విడతలో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసే విధంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.
మధ్య మానేరు బ్యాక్ వాటర్ సమీపంలోని రామప్ప గుట్టలను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. దీని ద్వారా వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రజలకు వినోదం కలిగించే విధంగా ఉంటుందని అన్నారు. రామప్ప నుండి నాంపల్లి గుట్టకు అనుసంధానంగా వంతెనను నిర్మించే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు ద్వారా స్థానికులు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతీ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకున్నామని, గ్రామాలను వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, కంపోస్ట్ షెడ్ లతో అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. పట్టణాలను కూడా అదే విధంగా అభివృద్ధి చేసేలా అధికారులు పని చేయాలని సూచించారు.