విశ్వనగర కల సాకారానికి రూ. 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ …

7Sep 2017

విశ్వనగర కల సాకారానికి రూ. 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నగరంలో రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ దీపాలు, నాలాల విస్తరణ, మూసీ అభివృద్ధి – సుందరీకరణ ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రహదార్లకు రూ. 6,700 కోట్లు, నీటి సరఫరాకు రూ. 2,926 కోట్లు, మూసీ అభివృద్ధి కోసం రూ. 1,665 కోట్లు, ఎల్‌ఈడీ బల్బుల కోసం రూ. 400 కోట్లు, నాలాల విస్తరణకు రూ. 230 కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 8,225 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధికి మొత్తంగా రూ. 20,146 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు మంత్రి. అదనంగా రూ. 7 వేల కోట్లతో కేశవాపురం వద్ద తాగునీటి జలాశయ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. పనుల పురోగతిపై ప్రతి సోమవారం శాఖాధిపతులతో సమీక్షలు నిర్వహిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. దీపావళి వరకు నగరంలో ఎల్‌ఈడీ బల్బుల కార్యక్రమం పూర్తి అవుతుందన్నారు మంత్రి.