వరంగల్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్
వరంగల్ నగరంలోని సమ్మయ్య నగర్ వద్ద రూ. 22 కోట్లతో చేపట్టే నాలా పై నిర్మించే వాల్, రూ.54 కోట్లతో చేపట్టే వరద నీటి డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీ కేటీఆర్
వరంగల్ నగరంలో రూ.21.5 కోట్లతో చేపట్టిన వడ్డేపల్లి చెరువు కట్ట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, వరంగల్ (పశ్చిమ) ఎమ్మెల్యే శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని శివనగర్ నుండి మైసయ్య నగర్, ఆర్.ఎస్ నగర్ నుండి 12 వెంట్స్ వరకు నిర్మిస్తున్న వరదనీటి తూము మరియు డక్ట్ పనులు, బట్టల బజార్ వద్ద ఆర్వోబి, శివనగర్ వద్ద ఆర్.యూ.బిని మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
వరంగల్ నగరం ఎస్.ఆర్ నగర్లో రూ. 11.02 కోట్లతో నిర్మించ తలపెట్టిన 208 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు రూ. 38.85 కోట్ల వ్యయంతో సీకేయం నుండి లేబర్ కాలనీ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి శ్రీ కేటీఆర్.
వరంగల్ నగరం లక్ష్మీపురంలో రూ. 24 కోట్లతో నిర్మించిన అత్యాధునిక సమీకృత (Integrated) మార్కెట్ ను మరియు రూ. 6.24 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆదర్శ (Model) కూరగాయల మార్కెట్ ను ప్రారంభించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్.
వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్ లో నిర్మిస్తున్న షాదీ ఖానా మరియు మండి బజార్ లో నిర్మిస్తున్న హజ్ హౌజ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్