హుజూర్ నగర్ మున్సిపాలిటీ సమీక్షా సమావేశం

5Jun 2018

Huzur Nagar Municipal Chairman & Councillors led by Minister Jagadish Reddy Garu, MP Sukhendar Reddy Garu & MP Lingaiah Yadav Garu called on me with proposals to improve infrastructure in their town

On their request, announced Rs.25 Cr from Urban Development dept : KTR

హుజూర్ నగర్ మున్సిపాలీటీకి 25 కోట్ల ప్రత్యేక నిధులు

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పైన పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి లు ఈరోజు సమీక్షా సమావేశాన్ని బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న పలు సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి హాజరైన పలువురు కౌన్సిలర్లు, అధికారులు మరియు స్థానిక మంత్రి, ఎంపీల కోరిక మేరకు మునిసిపాలిటీకి 25 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను పురపాలక శాఖ తరఫున కేటాయించనున్నట్లు మంత్రి కేటీ రామారావు తెలిపారు. మునిసిపాలిటీకి వచ్చే సాధారణ నిధులతో పాటు అదనంగా ఈ నిధులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ నిధులతో నగరంలో శ్మశాన వాటికలు, రెండు పార్కులు, సిసి రోడ్లు, డ్రయినేజీలు, మాడల్ మార్కెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతోపాటు మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన ఊరచెరువు మిని ట్యాంకు బండు పనులు వేగవంతం అయ్యేలా చూస్తామని హమీ ఇచ్చారు. దీంతోపాటు నగరంలో గత ప్రభుత్వం మద్యలో వదిలేయడంతో సూమారు 2 వేలకు పైగా పక్కా గృహాలు అసంపూర్తిగా మిగిలాయని ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అవసరం అయిన 40 కోట్ల రూపాయాలను కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తామని మంత్రులు హమీ ఇచ్చారు. ప్రభుత్వం ఇస్తున్న 25 కోట్ల ప్రత్యేక నిధులతోపాటు పట్టణానికి అవసరం అయిన ఇతర కార్యక్రమాలను, పనులను చేపట్టేందుకు సహాకరిస్తామని, స్థూలంగా పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలని మంత్రి కెటి రామారావు వారికి సూచించారు. ప్రణాళిక బద్దంగా పట్టణం అభివృద్ది చెందేందుకు ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగ పడుతుందన్నారు. దీర్షకాలంగా పెండిగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి, పట్టణాభివృద్ది కోసం ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్న మంత్రికి పట్టణ కౌన్సిలర్లు, స్థానిక మంత్రి, ఏంపిలు దన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపిలు శ్రీ బూర నర్సయ్య గౌడ్, శ్రీ బడుగు లింగయ్య యాదన్, ఇతర నాయకులు పాల్గోన్నారు