జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ను మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.

7Aug 2021

జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ను మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.అనంతరం జరిగిన సమావేశంలో నేతన్నలను ఉద్దేశించి ప్రసంగింస్తూ…చేనేత కార్మికుల‌కు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం అని తెలిపారు. 2018 నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో చేనేత‌ క‌ళాకారుల‌ను స‌త్క‌రించి, అవార్డులు అందిస్తున్నామ‌ని తెలిపారు. అవార్డుతో పాటు న‌గ‌దు పుర‌స్కారం రూ. 25 వేల‌ను అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ఏడాది 31 మంది చేనేత‌ క‌ళాకారుల‌ను స‌త్క‌రించుకున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
May be an image of 2 people and people standing
ప్ర‌తి సంవ‌త్స‌రం ఎగ్జిబిష‌న్ నిర్వ‌హించి, చేనేత వ‌స్ర్తాల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. ఈ ప్ర‌త్యేక‌మైన నైపుణ్యాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు ఈ -కామ‌ర్స్ ద్వారా ఈ -గోల్కొండ పోర్ట‌ల్‌ను రూపొందించుకున్నాం. వీటి ద్వారా చేనేత అమ్మ‌కాల‌ను విక్ర‌యిస్తున్నాం. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా మ‌న సంప్ర‌దాయాన్ని, స‌మ‌కాలీన మార్పుల‌ను దృష్టిలో ఉంచుకుని.. కొత్త‌కొత్త డిజైన్ల‌తో ఈత‌రం, భ‌విష్య‌త్ త‌రం పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునే విధంగా డిజైన్ల‌ను రూపొందిస్తున్నాం. అలా చేయ‌డం వ‌ల్ల ప‌ది కాలాల పాటు మ‌నుగడ ఉంటుంద‌నే ఉద్దేశంతో ఫ్యాష‌న్ షోల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.
డ‌బుల్ ఇక్క‌త్, ఆర్మూర్ ప‌ట్టుచీర‌లు, జ‌రిచీర‌లు, సిద్దిపేట గొల్ల‌భామ చీర‌లు తెలంగాణ స‌మాజంలో అంద‌రి ముందు క‌ద‌లాడుతున్నాయి. ఆధునిక‌మైన టెక్నాల‌జీని జోడించి కొత్త డిజైన్ల‌ను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌చ్చే నేత క‌ళాకారుల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం పెద్ద ఎత్తున బ‌డ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నాం. నేత‌న్న‌కు చేయూత ద్వారా కార్మికులకు భ‌రోసా ఇస్తున్నాం. చేనేత మిత్ర కింద నూలు, ర‌సాయ‌నాలు, రంగుల‌ను 50 శాతం స‌బ్సిడీతో కార్మికుల‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు. న‌వ‌త‌రాన్ని ఆక‌ట్టుకునే విధంగా చేనేత‌ల‌ను తీర్చిదిద్దుతున్నాం అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.
May be an image of 3 people, people standing and indoor
May be an image of 4 people and people standing