కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం నేతన్నలకు కష్టకాలంలో ఉపయుక్తంగా నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

31Aug 2020

Image may contain: 1 person, sitting

నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన పొదుపు డబ్బులను నేతన్నలు గడువుకు ముందే తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు వారికి ఎంతో చేయూతని అందించిందని తెలియజేశారు. ఈ పథకంలో భాగంగా డబ్బులు వెనక్కి తీసుకోవడం ద్వారా సుమారు రాష్ర్టంలోని 25వేల మంది నేతన్నలకు లబ్ది కలిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేయూత పొదుపు పథకం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికులు చెల్లించిన పొదుపు మొత్తానికి రెట్టింపు, పవర్ లూమ్ కార్మికుల వాటాకు సమానంగా ప్రభుత్వం ప్రత్యేక అకౌంట్లలో జమ చేసిందని, సుమారు మూడు సంవత్సరాల కాలానికి లాకిన్ పీరియడ్ ఉండగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ముందే డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. దీంతో సుమారు చేనేత కార్మికులకు 96.43 కోట్లు, పవర్లూమ్ కార్మికులకు సుమారు 13 కోట్లు మొత్తంగా 110 కోట్ల రూపాయల నిధులు డబ్బులు రాష్ట్రంలోని నేతన్నలకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం కష్టకాలంలో తమ పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు అనేకమంది నేరుగా తనకు నేరుగా మెసేజ్ లు పంపిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దీంతోపాటు మరోసారి ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాలని వారు కోరుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హ్యాండీక్రాఫ్ట్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి రాష్ట్రంలోని చేనేత మరియు పవర్లూమ్ నేతన్నల సంక్షేమానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో బతుకమ్మ చీరల పై సమీక్షించారు. ఇప్పటికే బతుకమ్మ చీరలకు సంబంధించిన ఉత్పత్తి దాదాపు పూర్తి కావచ్చిందని, వాటి పంపీణీకి సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి సారించామని మంత్రి కేటీఆర్ కి అధికారులు తెలియజేశారు. బతుకమ్మ పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే పంపిణీ ప్రారంభం కావాలని, అక్టోబర్ రెండవ వారంలోగా పంపిణీ పూర్తయ్యేలా చూడాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పంపిణీ ఉండేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని టెక్స్టైల్ శాఖ కార్యదర్శి, మరియు ఉన్నతాధికారులకు సూచించారు. ప్రస్తుతం అనేక మంది చేనేత వస్త్రాలకు సంబంధించి అవగాహన పెరిగిందని, ఈ మేరకు అనేకమంది చేనేత వస్త్రాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టెస్కో వస్త్రాలకు మరింత బ్రాండింగ్ కల్పించే ప్రయత్నాలను వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతోపాటు హైదరాబాదులో నలువైపుల షోరూంలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

Image may contain: 1 person, sitting

గోల్కొండ హ్యండిక్రాప్ట్స్ షోరూంను సందర్శించిన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశాన్ని ముగించుకున్న అనంతరం ముషీరాబాద్ లోని గోల్కొండ షోరూంను సందర్శించారు. అక్కడ ఉన్న చేనేత వస్త్రాలు, నిర్మల్ పెయింటింగ్స్ వంటి హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. ప్రస్తుతం షో రూమ్ నడుస్తున్న తీరుని, ఉత్పత్తులకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను అడిగి తెలుసుకున్నారు. షోరూం వెనకాల ఉన్న కామన్ ఫెసిలిటీ సెంటర్ ను సందర్శించి అక్కడ పనిచేస్తున్న కళాకారులతో మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Image may contain: 2 people, people standing and indoor

Image may contain: one or more people, people standing and indoor