Delighted to announce that BFSI major US based MassMutual is setting up their Global Capability Center in Hyderabad, Telangana

11Jan 2021

Leading US life insurer Massachusetts Mutual Life Insurance Company (massmutual) announced the setting up of their Global Capability Center in Hyderabad, Telangana.
“MassMutual, a 170-year old Fortune 500 organization & a world leader in the Insurance & Finance Industry, choosing Hyderabad and establishing its first Global Capability Center outside USA here is a testimony to the investor friendly policies of Telangana Govt,” said Minister KTR.
Image may contain: 1 person, sitting, table and indoor

హైదరాబాద్ నగరానికి మరో వెయ్యి కోట్ల పెట్టుబడి

-హైదరాబాద్ నగరంలో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ని ప్రకటించిన ప్రముఖ ఆర్థిక సేవలు మరియు భీమా సంస్థ మాస్ మ్యూచువల్ కంపెనీ

-కంపెనీని హైదరాబాద్ నగరానికి స్వాగతించిన మంత్రి కేటీఆర్

-లక్షా యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో తమ కేంద్రాన్ని ప్రారంభించనున్న కంపెనీ

-ఇప్పటికే 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్న కంపెనీ… భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు

-ప్రపంచంలోని అనేక నగరాల పరిశీలన తర్వాత హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నామని తెలిపిన కంపెనీ

-ఇక్కడ అందుబాటులో ఉన్న టాలెంట్ పూల్ మరియు ప్రో యాక్టివ్ ప్రభుత్వ విధానాలే ఇందుకు ప్రధాన కారణం అన్న కంపెనీ

Image may contain: 2 people
హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మరియు ఇన్సూరెన్స్ దిగ్గజం మాస్ మ్యూచువల్ హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని హైదరాబాదులో ప్రకటించింది. ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి శ్రీ కేటీఆర్ ఈ సెంటర్ ను ప్రకటించారు. మాస్ మ్యూచువల్ దశలవారీగా హైదరాబాద్ నగరంలో ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ద్వారా 1000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కోసం కంపెనీ పెద్దఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుందని, ఇప్పటిదాకా సుమారుగా 300కు పైగా ఉద్యోగులను కంపెనీ నియమించుకున్నదని తెలిపారు. రానున్న భవిష్యత్తులోనూ పెద్దఎత్తున ఉద్యోగాలను ఈ కంపెనీ కల్పించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఈ కంపెనీ లక్షా యాభై వేల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రోజు కంపెనీతో జరిగిన సమావేశంలో మంత్రి వారితో మాట్లాడి, ప్రభుత్వం అన్ని విధాలుగా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలకి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ పెట్టుబడులకు ఎంచుకున్నయని, ఈ రోజు 170 సంవత్సరాల వాణిజ్య, వ్యాపార చరిత్ర కలిగిన ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిన మాస్ మ్యుచువల్ తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కేంద్రాన్ని, అమెరికా అవతల తన మొదటి సెంటర్ ఏర్పాటు చేయడం అంటే, ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్న విషయం మరోసారి నిరూపితమైంది అన్నారు. హైదరాబాద్ నగరానికి కంపెనీని స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్ రానున్న కాలంలో కంపెనీ మరింత పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.