తెలంగాణలో జ్యూట్ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చిన మూడు కంపెనీలు.మంత్రులు శ్రీ కేటీఆర్ , శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీ గంగుల కమలాకర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న గ్లోస్టర్ లిమిటెడ్, కాళేశ్వరం అగ్రో లిమిటెడ్, ఎంబిజి కమాడిటిస్ లిమిటెడ్. గ్లోస్టర్ – 330 కోట్లు, కాళేశ్వరం అగ్రో లిమిటెడ్ – 254 కోట్లు, ఎంబిజి కమాడిటిస్ లిమిటెడ్ – 303 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మూడు సంస్థలు వరసగా వరంగల్, కామారెడ్డి, సిరిసిల్లలో జ్యూట్ మిల్లులు ఏర్పాటు చేయనున్నాయి. ఈ పెట్టుబడులతో 10,400 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.