18Mar 2019
వికారాబాద్, భూపాలపల్లి మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.