Minister KTR reviewed the ongoing initiatives of Telangana State Industrial Infrastructure Corporation Ltd (TSIIC) in Hyderabad

25Aug 2020

Image may contain: one or more people, people sitting, table and indoor

Minister KTR chaired a series of review meetings with industries department officials

IT and Industries Minister Sri KTR reviewed the ongoing initiatives of Telangana State Industrial Infrastructure Corporation Ltd (TSIIC) in Hyderabad today. Minister instructed the officials to monitor the progress of various industries that have been allotted lands in the state to ensure they start production in a time-bound manner.

Minister asked the officials to issue show-cause notices to the firms that have not started their operations even after being allocated lands.

Minister instructed the officials to prepare a detailed blue book with complete information of the industries in a sector-wise manner. He stated that this information will be useful for the government to come up with policies and programs.

Minister KTR also launched the e-SFC 360 view Digital Platform of Telangana State Financial Corporation. He also reviewed the works of State Financial Corporation and instructed the officials to expand their operations. He stated that the government will provide complete support to the corporation.

Minister KTR reviewed the works of Hyderabad Pharma City. Chief Secretary Somesh Kumar and HoDs of finance, industries, and MA&UD departments participated in the meeting.

During the meeting, Minister KTR stated.that the pharma city will be pollution-free and international standards would be maintained.

Minister KTR stated that the Pharma City will have zero liquid discharge units, and arrangements will be made for the centralized treatment of the waste material from the pharma city. The Hyderabad Pharma City will be set up in a Live, Work, and Learn model where the employees can reside on the same campus.

Minister instructed the officials to start skill training centers to train the local youth who will be given top priority during the recruitment by the companies in Hyderabad Pharma City.

పరిశ్రమల శాఖ పైన మంత్రి శ్రీ కేటీఆర్ ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటిదాకా పరిశ్రమల కోసం భూములను తీసుకొని నిరుపయోగంగా ఉన్న వాటిపైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి వాటిని ప్రారంభమయ్యేలా చూసి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పెట్టుబడులు తేస్తున్నామని, అయితే కంపెనీలు సైతం ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఈ మేరకు నిర్ణీత గడువు లోపల కార్యకలాపాలు ప్రారంభించని వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. దీంతోపాటు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పేరుతో మార్పిడి చేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి కూడా సమీక్షించిన మంత్రి, ఇలా కార్యకలాపాలు ప్రారంభం కానీ కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించారు.

దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట చేర్చాలని ఇందుకోసం ఒక బ్లూ బుక్ ని తయారు చేయాలని సూచించారు. ఇందులో అన్ని పరిశ్రమల సమగ్ర సమాచారం ఉండేలా చూడాలని సూచించారు. ఆయా కంపెనీలు నిర్వహిస్తున్న వారికి వివరాలు, పరిశ్రమల కేటగిరీలతో(సూక్ష్మ, ఎంఎస్ఎంఈ) పాటు ఆయా కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ వర్గాల్లో ఉన్న సమ్మిళిత స్ఫూర్తి తెలుస్తుందన్నారు. ఇలాంటి సమాచారంతో ప్రభుత్వం వద్ద కంపెనీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందుబాటు ఉంటే ఇతర కార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పైన సమీక్ష

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించిన ఈ-ఎస్ ఎఫ్ సి డిజిటల్ ప్లాట్ ఫామ్ ని లాంచ్ చేశారు. దీంతో పాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించిన కార్యకలాపాల పై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్, కార్పోరేషన్ కార్యకలాపాలను మరింతగా విస్తరించే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని కోసం ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన అంశాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించిన మంత్రి ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు.

కాలుష్య రహితంగా హైదరాబాద్ ఫార్మాసిటీ- మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ఫార్మా సిటీపైన ఈ రోజు ఉన్నత స్ధాయి సమావేశం జరిగింది. టి- ఫైబర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ తో పాటు ఫైనాన్స్, పురపాలక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఎం ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ప్రస్తుతం ఫార్మాసిటీలో కొనసాగుతున్న మౌళిక వసతుల నిర్మాణం, కంపెనీల నుంచి వస్తున్న స్పందన వంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించారు. ఫార్మాసిటీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపిన పరిశ్రమల శాఖా అధికారులు, ఫార్మాసిటీకి పరిశ్రమల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. వందలాది కంపెనీల ఇప్పటికే ఫార్మాసిటీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్ధేశం చేసిన మంత్రి కేటీఆర్, ఫార్మాసిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పాలని ముఖ్యమంత్రి ఇచ్చిన అదేశం మేరకు ముందుకు పోదామన్నారు. ఈ మేరకు కట్టుదిట్టమైన మాస్టర్ ప్లానింగ్ తో పాటు, ఫార్మాసిటీ ద్వారా ఏలాంటి కాలుష్యం లేకుండా చూడాలన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ముందుకు పోయేందుకు ఇప్పటికే పరిశ్రమల శాఖాధికారులు పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్లను సందర్శించి వచ్చారన్నారు. ఇక్కడ వచ్చే ఫార్మాసిటీ సైతం అదే స్ధాయిలో ఉండాలన్నారు. ఈ మేరకు ఇప్పటికే పరిశ్రమల శాఖ చర్యలు తీసుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. విండ్ ప్లో అధ్యాయనం సైతం చేసినట్లు, ఆమేరకే మాస్టర్ ప్లానింగ్ ఉందన్నారు. దీంతోపాటు ఫార్మా సిటీలో ఫార్మ యూనిట్లు అత్యదిక శాతం జిరో లిక్విడ్ డిచ్చార్జ్ యూనిట్లు ఉంటాయన్న కేటీఆర్, ఫార్మా సిటి వ్యర్ధాలను కేంద్రీకృతంగా శుద్ధి జరిగేలా ఎర్పాట్లు ఉంటాయన్నారు. తద్వారా వ్యర్ధాల శుద్ది విషయంలో అత్యుత్తమ ప్రమాణాలతో పాటు, కంపెనీల విచక్షణ లేకుండా పటిష్టంగా జరుగుతుందన్నారు. ఇలా ఫార్మసిటీ కాలుష్యం భయం లేకుండా ఉంటుందన్నారు. దీంతోపాటు ఫార్మసిటీ ఏర్పాటు లివ్, వర్క్, లెర్న్ స్పూర్తితో ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో అందులో పనిచేసేవారికి అక్కడే నివాస సౌకర్యాలుంటాయన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా అత్యుత్తమ విద్యాసంస్ధలు ఎర్పడతాయన్నారు.
ఈ సమావేశంలో మరోసారి స్థానికులకు ఉద్యోగాలు కల్పించే అంశాన్ని చర్చించారు. దీనికోసం స్దానిక శిక్షణ కేంద్రాల ఎర్పాటుపైన చర్చించారు. పరిశ్రమల శాఖ, జిల్లా యంత్రాంగం ఇందుకోసం కలిసి పనిచేయాలని సూచించారు.