కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్.
ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ..
-ఢిల్లీ మెడలు వంచాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి. ఇద్దరు ఎంపీలతోనే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారు. 16 మందిని గెలిపిస్తే ఇంకెంత చేస్తారో ఆలోచించాలి.
-రైల్వే మంత్రి ఎవరైతే ఆ రాష్ట్రానికే రైళ్లు వెళ్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ గాంధీకి మాత్రమే లాభం. తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే మోదీకి మాత్రమే లాభం. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం.
-కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కేసీఆర్ ఒక కూటమి తయారు చేస్తారు
-రూ.80వేల కోట్ల రాష్ట్ర నిధులు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం.కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులు ఇవ్వమంటే బీజేపీ ఇవ్వలేదు. సమర్థులైన ఎంపీలు 16 మంది ఉంటె ఢిల్లీని శాసించవచ్చు.
-కరీంనగర్ జిల్లాలో రైలు రావాలంటే ఎంపీలు ఢిల్లీ మెడలు వంచే పరిస్థితి ఉండాలి. కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీ వినోద్ కుమార్‌ను గెలిపిస్తే.. రెండేళ్లలో కరీంనగర్‌కు రైలు వస్తుంది.
-పింఛను వయసు తగ్గించడంతో మరో 8 లక్షల మందికి పింఛన్లు అందుతాయి. కాళేశ్వరం పూర్తయితే కాలువలన్నీ నీళ్లతో కళకళలాడుతాయి. రూ.80వేల కోట్ల రాష్ట్ర నిధులు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. తెలంగాణకు రూ.25వేలు కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. మోదీ నిధులు ఇవ్వలేదు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న రాష్ర్టాలకే మోదీ నిధులు ఇస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు వాళ్ల అధిష్టానంపై పోరాడే ధైర్యం లేదని శ్రీ కేటీఆర్ విమర్శించారు.