నూతనంగా ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లతో తెలంగాణ భవన్ లో సమావేశమైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్.
హాజరైన మంత్రులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ సిహెచ్ మల్లారెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ గంగుల కమలాకర్ మరియు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు.
ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ..
రాష్ట్రంలో 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికిపైగా సంఘాల్లో రైతులు టీఆర్‌ఎస్ మద్దతుదారులను గెలిపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం. రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఇది. రైతు సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదు. సహకార సంఘం ఎన్నికల్లో రైతులు అపూర్వ విజయాన్ని అందించారని అన్నారు.