IT and Industries Minister KTR inaugurated several developmental programmes at Banswada.
Legislative Assembly Speaker and Banswada MLA Sri Pocharam Srinivas Reddy, Ministers Sri KTR and Sri Vemula Prashanth Reddy inaugurated Mini Stadium & Mini Tank Bund and also Newly laid CC Main Road in Banswada.
బాన్సువాడలో రూ.100 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.
బాన్సువాడలో రూ. 7.53 కోట్లతో అభివృద్ధి చేసిన మినీ ట్యాంక్ బండ్ ను, రూ. 34.90 కోట్లతో నిర్మించిన సీసీ మెయిన్ రోడ్డును మరియు రూ. 2.65 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియంను అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ‘బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. బాన్సువాడలో 2వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నాం.
స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేసిన కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. గృహ నిర్మాణానికి పట్టణంలో రూ.5.30 లక్షలు, గ్రామాల్లో రూ.5లక్షలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.