Mana Nagaram program at Nagole, LB Nagar Constituency.

18Jun 2018

ఎల్బీనగర్, నాగోల్‌లో జరిగిన మననగరం కార్యక్రమానికి మంత్రి శ్రీ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రజల చెంతకు పాలన తీసుకురావడానికే మననగరం కార్యక్రమం అన్నారు. ప్రజల సొమ్ముకు తాము ధర్మకర్తలం మాత్రమేనని, ప్రజలు ఆదాయపన్ను సక్రమంగా చెల్లించాలని కేటీఆర్ కోరారు. నగరవాసులు కోరుకునే నాణ్యమైన జీవనం అందించేందుకు కృషి చేస్తున్నాం. పౌరులు చెల్లించే పన్నులతోనే నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన తడి, పొడి చెత్త బుట్టలను తప్పకుండా వినియోగించాలని కేటీఆర్ కోరారు.