MA&UD Minister KTR held a marathon meeting with the MA&UD officials at Buddha Bhavan in Hyderabad.

21Nov 2019

MA&UD Minister Sri KTR held a marathon meeting with the MA&UD officials at Buddha Bhavan in Hyderabad.

In the meeting, Minister discussed the steps to be taken for the development and beautification of Hussain Sagar, Durgam Cheruvu and Gandipet lakes.

Minister reviewed the master plans prepared by consultants. He stated that the master plans should be prepared in a way that it retains the natural beauty of the lakes and at the same time, provide facilities to the people.

Minister approved the proposals of the Hyderabad Metropolitan Development Authority (HMDA) to build a park on the banks of Gandipet lake. He asked the officials to start the works immediately. He also instructed the officials to prepare proposals to develop 40 Kilometer walking and cycling tracks around the Gandipet lake.

Minister also reviewed the status of the HMDA layouts works in Kokapet. He asked the officials to improve road connectivity to the areas of Kollur and Kokapet keeping in mind the increasing population.

During the meeting, Minister KTR asked the officials to ensure the logistics parks being developed by the HMDA have all the amenities to meet the increasing demand for logistics.

Minister also looked into the proposals for the Hyderabad Habitat Centre which will be constructed by the HMDA. He said that the habitat center should have all the facilities to conduct art and cultural events.

Minister instructed the officials to identify locations for construction of convention centers similar to the Hitex Convention center in areas such as Uppal and Medchal.

Soon, a high-level meeting will be called for, chaired by Minister KTR and Forest Minister. Public representatives and concerned officials under HMDA limits will take part in the meeting where an action plan to increase the green cover in the region will be discussed.

Mayor Bonthu Ram Mohan, MA&UD Principal Secretary Arvind Kumar EVDM Director Viswajit Kampati and senior officials participated.

పురపాలక శాఖమంత్రి శ్రీ కేటీఆర్ ఈరోజు హెచ్‌ఎండీఏ కార్యక్రమాలపైన సమీక్ష నిర్వహించారు. బుద్దభవన్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో హెచ్‌ఎండీఏ చేపట్టిన కార్యక్రమాల పురోగతిని, ప్రణాళికలను చర్చించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న ప్రధాన సరస్సులైన హూస్సేన్ సాగర్, దుర్గం చెరువు, గండిపేట చెరువుల అభివృద్దిపైన ఈ సమావేశంలో చర్చించారు. పలువురు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్లను ఈసందర్భంగా పరిశీలించారు. ముఖ్యంగా హూస్సేన్ సాగర్, గండిపేట చెరువుల అభివృద్ది కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను కన్సల్టెంట్లు వివరించారు. జలాశయాల సహజత్వాన్ని కాపాడుతూ, నగర ప్రజలకు అహ్లదం పంచేతీరుగా ఈ మాస్టర్ ప్లానింగ్ ఉండాలని ఈ సందర్భంగా మంత్రి సూచన చేశారు. గండిపేట వద్ద పార్కు కోసం హెచ్‌ఎండీఏ తయారు చేసిన ప్రణాళికలకు అమోదం తెలిపిన మంత్రి, త్వరలోనే అక్కడ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతోపాటు గండిపేట జలాశయం చుట్టూరా సూమారు 40 కీలోమీటర్ల మేర వాకింగ్ ట్రాకులు, సైక్లింగ్ ట్రాకులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ప్రారంభించాలని, ఇందుకోసం జిల్లా యంత్రాంగం, నీటి పారుదల శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. హెచ్‌ఎండీఏ కోకాపేటలో అభివృద్ది చేయనున్న లేఅవుట్ పైన మంత్రి సమీక్ష చేశారు. ఇప్పటికే కోకాపేట, కొల్లూర్ లాంటి ప్రాంతాల్లో జన సాంద్రత పెరగడం, పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్న భవన సముదాయాలు, కార్యాలయాల నేపథ్యంలో అక్కడ విస్తరించాల్సిన రవాణా మౌళిక వసతుల కల్పనపైన చర్చించారు. దీంతోపాటు హెచ్‌ఎండీఏ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే హెచ్‌ఎండీఏతోపాటు ప్రైవేట్ సంస్ధలతో కలిసి పలు లాజిస్టిక్ పార్కులను అభివృద్ది చేస్తున్నదని, అయితే పెరుగుతున్న లాజిస్టిక్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, హెచ్‌ఎండీఏ స్వయంగా ఏర్పాటు చేసే పార్కులు, ప్రస్తుతం ఉన్న వాటి కన్నా పెద్దవై ఉండాలని, కనీసం 50 ఎకరాల పైన ఉండాలని సూచించారు. లాజిస్టిక్ పార్కుల ఏర్పాటులో మల్టి మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుపైన దృష్టి సారించాలన్నారు. హెచ్‌ఎండీఏ నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ హబిటాట్ సెంటర్ ప్రతిపాదనలపైన మంత్రి సమీక్షించారు. హైదరాబాద్ నగరంలోని కళలు, సంస్కృతికి అద్దంపట్టేలా, వాటిని ఊతం ఇచ్చేలా ఈ సెంటర్ ఉండాలని సూచించారు. దీంతోపాటు హైటెక్స్, హెచ్ఐసిసి మాదిరి నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ కన్వెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని హెచ్‌ఎండీఏ సూచించారు. ఉప్పల్, మేడ్చెల్ లాంటి సిటీ పరిసర ప్రాంతాలతోపాటు సెంట్రల్ సిటీ ప్రాంతాల్లోనూ ఈ కన్వేషన్ సెంటర్లను నిర్మించేందుకు అందుబాటులో ఉన్న ప్రాంతాల గుర్తింపుపైన ఆయా జిల్లాల యంత్రాంగాలతో చర్చించాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ అర్బన్ పారెస్టీ కార్యలాపాలపైన ఈ సమావేశంలో అధికారులు మంత్రికి వివరాలు అందించారు. హెచ్‌ఎండీఏ పరిధిని 20 యూనిట్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లోని ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ది చేయాలన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజ్ ప్రాంతాల్లో మరింత గ్రీనరీ అభివృద్దిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని, గ్రామ పంచాయితీల అధికారులు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లులోని ఫారెస్ట్ డిపార్టమెంట్, అర్బన్ ఫారెస్ట్ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ సమావేశానికి అటవీశాఖ మంత్రితో కలిసి హజరవుతామని తెలిపారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.