MA&UD Minister Sri KTR chaired a meeting with HoDs of MA&UD Department on recruitment of ward officers in municipalities.

21Aug 2020

పట్టణాల్లో ప్రజలకు పౌర సేవలను మరింతగా వేగంగా ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, క్యాబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ప్రగతి భవన్ లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ఈమేరకు పురపాలక శాఖ నిర్ణయం తీసుకున్నది. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీ పైన ఆరుసార్లు అంతర్గతంగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన అనంతరం, ఈ రోజు తుది నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖలో 2298 కొత్త ఖాళీలను భర్తీ చేసే ముందు సంబంధిత పోస్టులను, ఉద్యోగులను రెషనలైజ్(హేతుబద్ధీకరణ) చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పురపాలకశాఖ అంతర్గతంగా చర్చలు నిర్వహించి ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

Image may contain: 1 person, sitting

పరిశుభ్రమైన పట్టణాలు, ప్రణాళిక భద్దమైన పట్టణాలు, ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలన్న ముఖ్యమంత్రి అలోచనల మేరకు రూపొందించిన నూతన పురపాలక చట్టానికి అనుగణంగా ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రజలకి వేగంగా పౌర సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. దీంతో పురపాలనలో నూతన మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు అయన తెలిపారు. ఈమేరకు ప్రతి వార్డుకు ఒక పురపాలక ఉద్యోగిని ఉంచే లక్ష్యంలో వార్డు అఫీసర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇలా అన్ని వార్డుల్లో ఒక అధికారి ఉండడం దేశంలోనే మెదటిసారి అని మంత్రి కేటీఆర్ అన్నారు. పురపాలక చట్టం నిర్ధేశించిన పారిశుద్ధ్యం, హారిత హారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పురసేవల అమలు మెదలైన కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఈ వార్డు అఫీసర్ల నియామకం దోహాదం చేస్తుందన్నారు.

ఖాళీల భర్తీ తర్వాత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు, పురపాలక శాఖ నూతన చట్టం ప్రకారం స్ఫూర్తితో ముందుకు పోయేందుకు వీలు కలుగుతుందన్నారు. వార్డు అఫీసర్ల నియామకం ద్వారా ప్రజలకు పురపాలక శాఖకు అవసరమైన వారధి ఎర్పడుతుందని, తద్వారా పురపాలనా అంటే పౌర పాలన అనే స్పూర్తి నిజం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. పురపాలకశాఖ ఇంజనీరింగ్ పనులంలో ప్రస్తుతం జరుగుతున్న అసాధారణ జాప్యం అరికట్టేందుకు ఇద్దరు ఛీప్ ఇంజనీర్లను ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. వీటి భర్తీ అత్యంత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.