2May 2018
ఎల్బీనగర్ నియోజకవర్గం, చింతలకుంట చౌరస్తా వద్ద నిర్మించిన అండర్‌పాస్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. రూ. 18.70కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అండర్‌పాస్‌తో విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తగ్గనున్నాయి. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా అందుబాటులోకొచ్చిన ప్రాజెక్టులో ఇది మూడవది.ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ మల్లారెడ్డి, నగర మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ మరియు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.