Minister KTR expressed happiness on Telangana state winning 12 awards under various categories of the Ministry of Housing and Urban Affairs ‘Sanitation Challenge

13Nov 2021

MA&UD Minister KTR expressed happiness on Telangana state winning 12 awards under various categories of the Ministry of Housing and Urban Affairs ‘Sanitation Challenge’. The awards will be presented at the Swachh Amrit Mahotsav event in New Delhi on November 20.
Minister KTR congratulated all the Mayors, Municipal Commissioners, and Municipal Chairpersons for their tireless work.
With an intention to develop towns and cities, Telangana Govt. has introduced the Pattana Pragathi program in the State. Before the State was formed, the number of municipalities were only 68, but after the State formation we have increased the number to 142.
Minister addressed the media today at CDMA Office in Hyderabad. Special Chief Secretary Arvind Kumar, Commissioner & Director of Municipal Administration Dr.N.Satyanarayana, & GHMC Commissioner Lokesh Kumar were present.
May be an image of 4 people, people sitting and people standing
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ “శానిటేషన్ ఛాలెంజ్” పేరిట జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో వివిధ క్యాటగిరీల్లో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, మున్సిప‌ల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మాస‌బ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీసులో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
గ‌త ఏడున్న‌ర సంవ‌త్స‌రాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధిస్తోంది. వివిధ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌ట్ట‌ణాలు అభివృద్ధి చెందాల‌నే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప‌ట్ట‌ణాభివృద్ధిలో స‌మూల‌మైన మార్పులు తీసుకువ‌చ్చారు. ఆద‌ర్శ‌వంత‌మైన ప‌ట్ట‌ణాల‌ను రూపొందించేందుకు సీఎం కేసీఆర్ కొత్త‌ మున్సిప‌ల్ చ‌ట్టాన్ని తీసుకొచ్చారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం కూడా అమ‌లు చేశారు. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 142కు పెంచాం. మున్సిపాలిటీల‌కు నిధుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ పుర‌పాల‌క సంఘాల‌కు రూ. 2,950 కోట్లు విడుద‌ల చేశాం. పార్కులు, మోడ‌ల్ మార్కెట్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, ఎల్ఈడీ లైట్లు, ప‌బ్లిక్ టాయిలెట్స్, వైకుంఠ‌ధామాలు, ఓపెన్ జిమ్స్, అర్బ‌న్ లంగ్ స్పేసెస్‌కు నిధులు ఖ‌ర్చు పెట్టాం. మౌలిక వ‌స‌తుల మీద దృష్టి సారించాం. అర్బ‌న్ మిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర‌మంలో భాగంగా నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాం. పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి స‌మ‌గ్ర‌మైన ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతున్నాం. కొత్త డంప్ యార్డులు ఏర్పాటు చేశాం. దేశంలో ఎక్క‌డా లేని విధంగా చ‌ట్టంలోనే గ్రీన్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టి, హ‌రిత ప‌ట్ట‌ణాల‌ను త‌యారు చేసేందుకు కృషి చేస్తున్నాం. టీఎస్ బీపాస్ చ‌ట్టాన్ని అమ‌లు చేశాం అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.
ఇప్ప‌టి దాకా తీసుకొచ్చిన చ‌ట్టాల‌న్నీ పౌరుడి కేంద్రంగా తీసుకువ‌చ్చాం అని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో చాలా ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు. మ‌న కార్య‌క్ర‌మాల‌కు వివిధ సంద‌ర్భాల్లో కేంద్ర గుర్తింపు లభించింది. తాజాగా శానిటేష‌న్ ఛాలెంజ్‌లో భాగంగా 4300 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు పోటీ ప‌డితే తెలంగాణ‌కు 12 పైచిలుకు అవార్డులు వ‌చ్చాయి. ఈ అవార్డులు రావడాన్ని ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి ల‌భించిన గుర్తింపుగా భావిస్తున్నాం. ఈ నెల‌ 20న విజ్ఞాన భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి, అధికారుల‌కు గ‌ర్వ‌కార‌ణం. మున్సిప‌ల్ అధికారుల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో ఇప్ప‌టికే 101 మున్సిపాలిటీల‌ను ఓడిఎఫ్ ప్ల‌స్ క్యాట‌గిరీలుగా కేంద్రం గుర్తించింది. 8 మున్సిపాలిటీల‌కు ఓడిఎఫ్ ప్ల‌స్ ప్ల‌స్ గుర్తింపు వ‌చ్చింది. స్ట్రీట్ వెండ‌ర్స్‌కు రుణాలను ఇవ్వ‌డంలో తెలంగాణ నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచింది. ప్ర‌తీ విష‌యంలో తెలంగాణ అగ్ర‌గామిగా నిలుస్తుందంటే కేవ‌లం ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలే అని స్ప‌ష్టం చేశారు. రూర‌ల్, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అద్భుతంగా జ‌రుగుతోంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.