Minister KTR expressed happiness that India’s first Integrated Rocket Design, Manufacturing and Testing Facility, by Skyroot Aerospace’s facility, will be based in Telangana.

25Nov 2022

Minister Sri KTR expressed happiness that India’s first Integrated Rocket Design, Manufacturing and Testing Facility, by Skyroot Aerospace’s facility, will be based in Telangana.

KTR said that he promised the startup’s Co-Founders Pawan Chandana and Bharath Daka of complete support for establishing the facility to design, manufacture, and test rockets in Telangana.

The Minister participated as Guest of Honour at a programme organized at T-Hub on Friday to celebrate Skyroot Aerospace’s successful launch of Vikram-S rocket. The Hyderabad based startup, incubated at T-Hub, and supported by TWorks launched India’s first private rocket on November 18, 2022.

Congratulating the team which endured hardships, he expressed pride and happiness that a spacetech company from Hyderabad, India, broke all the barriers. KTR said that only a few companies across the world aced rocket science and achieved success in the first go. The launch was a truly historic moment.

The Minister said that he would be thrilled to see Hyderabad as a Spacetech capital of India, and recalled that the State government already launched a Space Tech Policy.

He conveyed best wishes to Dhruva Space, a spacetech startup based in Hyderabad, which would launch two satellites tomorrow (November 26,2022).

తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో రాకెట్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన హైదరాబాద్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ అభినందన సభలో కేటీఆర్ ఈ మేరకు ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ అంతరిక్షంలో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా రాకెట్ ను ప్రయోగించి చరిత్ర సృష్టించిందని భవిష్యత్తులోను తెలంగాణ కేంద్రంగానే తమ కంపెనీ మరింత ముందుకు పోయే ప్రణాళికలు ఉన్నాయని స్కై రూట్ తెలిపింది. తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇందుకు సహకరించాలని మంత్రి కేటీఆర్ ను స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ కోరింది. ముందునుంచి స్కైరూట్ లాంటి కంపెనీలకు మద్దతివ్వడం తమకు గర్వకారణం అన్న కేటీఆర్, ఆ కంపెనీ భవిష్యత్ ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. స్కైరూట్ ప్రతిపాదిస్తున్న సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. స్కైరూట్ సక్సెస్ తో హైదరాబాద్, టీ హబ్ పేరు మరోసారి మారుమోగిందన్న కేటీఆర్, ఇందుకు ఆ కంపెనీకి అభినందనలు తెలిపారు. దేశ అంతరిక్షరంగంలో చరిత్ర సృష్టించిన స్కైరూట్ కు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందన్నారు కేటీఆర్. దేశ అంతరిక్ష రంగానికి ఇది చారిత్రాత్మక సందర్భం అన్నారు. రాకెట్ లాంటి సంక్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడం సులభం కాదన్న కేటీఆర్, తొలి ప్రయత్నంలో అంతరిక్షంలోకి రాకెట్ ను పంపగలిగే సత్తా సంపాదించడం మాములు విషయం కాదన్నారు. స్కైరూట్ కంపెనీ టీం వర్క్ తోనే ఇది సాధ్యమైందన్నారు. రాకెట్ తయారీ అంటేనే ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపించరని అయితే రాబోయే రోజుల్లో ఈ ఆలోచన మారుతుందన్నారు. స్పేస్ టెక్ కేపిటల్ గా హైదరాబాద్ మారుతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మరో స్టార్టప్ ధృవ కూడా త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం చేయబోతుందన్న కేటీఆర్, త్వరలో మరో సక్సెస్ స్టోరీని దేశం చూడబోతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన స్పేస్ టెక్ పాలసీతో ఇక్కడే రాకెట్ లు తయారుచేయవచ్చు. ఇక్కడి నుంచే ప్రయోగించవచ్చని కేటీఆర్ తెలిపారు.

ఒక అధ్భుతమైన ఆలోచనకు ఊతం ఇచ్చేలా టీ హబ్, టీ వర్క్స్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్న స్కైరూట్ ఏరో స్పేస్ కంపెనీ యాజమాన్యం, తమ ప్రస్థానంలో ఈ రెండింటి పాత్ర మరువలేనిదని తెలిపింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్ కు స్కైరూట్ కంపెనీ ధన్యవాదాలు చెప్పింది. 200 మంది స్కైరూట్ సిబ్బంది కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉందని ఆ కంపెనీ ప్రతినిధి పవన్ చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా భవిష్యత్తులోనూ తమ కంపెనీ విస్తరిస్తుందన్న పవన్, అంతరిక్ష రంగానికి సంబంధించిన విభిన్నమైన రంగాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సపోర్ట్ ఈకో సిస్టం హైదరాబాద్ లో ఉండడంతోనే ఈ విజయం సాధ్యమైందని గుర్తుచేశారు.

May be an image of 1 person, standing and indoor
May be an image of 4 people, people standing and indoorMay be an image of ‎4 people, people standing and ‎text that says "‎GUEST OF HON VIKRAM S RAMA MINIST حوم MADE MADEIN IN TEI ANG ANGANA WITH Fea RIVATE INDIA' FIRST ROCKET LAUNCH 11:30 AM, 18-11-2022‎"‎‎May be an image of 6 people, people standing and indoorMay be an image of 5 people, people standing and text that says "GUEST OF HONOUR VIKRAM S CEBA"