Minister KTR has met France Ambassador of Digital Affairs H. E. Henri Verdier in Paris

27Oct 2021

IT & Industries Minister KTR has met France Ambassador of Digital Affairs H. E. Henri Verdier in Paris today. Possible areas of collaboration like innovation, digitization in governance & applications of Open Data were among a host of topics discussed in the meeting.
Minister spoke about various digital initiatives of Government of Telangana, & digital infrastructure being created in the State.
Embassy of India to France Deputy Chief of Mission Dr K M Praphullachandra Sharma, Principal Secretary Jayesh Ranjan, Aerospace & Defence Director Praveen PA and Telangana Digital Media Wing Director Konatham Dileep were present in the meeting.
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా తొలిరోజున మంత్రి శ్రీ కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ తో సమావేశం అయ్యారు.
ఇన్నోవేషన్, డిజిటైజేషన్, ఓపెన్ డేటా వంటి అంశాల్లో ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశం గురించి ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, ఓపెన్ డేటా పాలసీ గురించి, రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మంత్రి కేటీఆర్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ కు వివరించారు. అటు తెలంగాణలోని ఆంకుర సంస్థలకు ఫ్రాన్స్ లో, ఇటు ఫ్రాన్స్ లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడం గురించి కూడా వివరమైన చర్చ జరిగింది. సమావేశంలో ఫ్రాన్స్ లో భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కే.ఎం. ప్రఫుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డైరెక్టర్ డిజిటల్ మీడియా కొణతం దిలీప్, డైరెక్టర్ ఏవియేషన్ ప్రవీణ్ పాల్గొన్నారు.
May be an image of 4 people, people sitting, people standing and indoor