మేకల అంజలికి ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక సాయం చేసిన మంత్రి శ్రీ కేటీఆర్

11Aug 2020

వరంగల్ జిల్లా హసన్ పర్తికి చెందిన మేకల అంజలికి మంత్రి శ్రీ కేటీఆర్ ఈ రోజు ఐఐటీ లో ఉన్నత విద్య అభ్యసించడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు, లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు.

గత ఏడాది హసన్ పర్తి లోని గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని ఐఐటీలో ర్యాంకు సాధించిన అంజలి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తనకు సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ గత సంవత్సరం సైతం ఫీజుల నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించారు. అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్ కావడంతో ఐఐటి విద్య కోసం అవసరమైన నిధులను వ్యక్తిగతంగా అందజేస్తానని మంత్రి గత ఏడాది హామీ ఇచ్చారు.

ఆ మేరకు అంజలి రెండవ సంవత్సరానికి సంబంధించిన ఖర్చులను ఈ రోజు ప్రగతిభవన్ లో అంజలికి అందజేశారు. మంత్రి కేటీఆర్ అందించిన చేయూత పట్ల ఆయనకు ధన్యవాదాలు తెలిపింది అంజలి కుటుంబం.