Minister KTR inaugurated the 2.81 kms long bi-directional flyover from Shilpa Layout to Outer Ring Road (ORR) near Gachibowli Junction.

25Nov 2022

Minister KTR inaugurated the 2.81 kms long bi-directional flyover from Shilpa Layout to Outer Ring Road (ORR) near Gachibowli Junction, built by GHMC. The infra project will ease flow of traffic at the junction, and improve connectivity to ORR.

Minister said that CM Sri K Chandrashekar Rao contemplated the Strategic Road Development Project (SRDP) in 2014-15 in tune with the pace Hyderabad was expanding. Minister KTR said that out of 48 SRDP projects, 33 were completed in the past six years.

To improve the road infra in Hyderabad, the Minister said that SRDP Phase-II will be taken up. Besides, CRMP is taken up to ensure over 710 kms-long main roads in the city are not damaged by the heavy rains, and link roads are developed to prevent traffic congestion.

To further improve public transportation, Minister said, the Hyderabad Metro line will be extended by 63-kms, which includes a 26-kms line from BHEL to Lakdikapul, 5-kms Nagole to LB Nagar, and 32-kms Mindspace to Airport lines.

Education Minister Smt Sabitha Indra Reddy, Chevella MP Dr Ranjith Reddy, Serilingampally MLA Sri Arekapudi Gandhi, MLCs Smt Surabhi Vani Devi and Sri P Mahender Reddy, Mayor Gadwal Vijaya Laxmi, Deputy Mayor Mothe Srilatha Reddy, and others were present on the occasion.#HappeningHyderabad.

గచ్చిబౌలి జంక్షన్ సమీపంలోని శిల్పా లేఅవుట్ నుండి ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు నిర్మించిన 2.81 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ను మంత్రి శ్రీ కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్‌ ద్వారా గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను సులభతరం చేయడంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ కు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి ఆలోచనల నుంచి పుట్టిందే స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఆర్‌డీపీ). ఈ ప్రాజెక్టు ఆయన మానస పుత్రిక అని అన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ భవిష్యత్‌ అవసరాలు, మౌలిక వసతులు.. ఇలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సరైన ప్రణాళికలు ఉండాలనే ఉద్దేశంతోనే ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమాన్ని రూపొందించి జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ శాఖకు సీఎం అప్పగించారు అని తెలిపారు. దీనిలో భాగంగా చేపట్టిన 48 ప్రాజెక్టుల్లో ఈ ఫ్లైఓవర్‌తో కలిపి ఇప్పటివరకు ఆరేళ్లలో 33 ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. హైదరాబాద్‌లో ఎంతో అత్యుత్తమంగా ఉన్నటువంటి మౌలిక వసతులు.. దేశంలో మరే రాష్ట్రంలో లేవని మనం గర్వంగా చెప్పుకొనే విధంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నాం అని అన్నారు. త్వరలో ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-2ను చేపడతాం అని తెలిపారు. సీఆర్‌ఎంపీ అనే కార్యక్రమాన్ని తీసుకొని నగరంలో 710 కిలోమీటర్లకుపైగా మెయిన్‌ రోడ్లను ఎంత వర్షం పడ్డా దెబ్బతినకుండా చర్యలు తోసుకున్నాం అని తెలిపారు. రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన అన్ని పనులను చేపడుతున్నామన్నారు.

మెట్రో రైల్ రెండో దశలో భాగంగా బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5 కిలోమీటర్లు, మైండ్‌ స్పేస్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మరో 32 కిలోమీటర్ల మేర చేపట్టనున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ అరికెపుడి గాంధీ ఎమ్మెల్సీలు శ్రీమతి సురభి వాణిదేవి, శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

May be an image of 10 people and people standing
May be an image of 5 people and people standingMay be an image of 9 people, people sitting and people standingMay be an image of street, sky and roadMay be an image of sky, road and skyscraper