Minister KTR participated in TS iPASS 5th Anniversary Celebrations

4Dec 2019

IT & Industries Minister KTR participated in the 5th Anniversary Celebrations of TS-iPASS (Telangana State Industrial Project Approval and Self Certification System) at Shilpakala Vedika in Hyderabad.

In the past five years, TS iPASS succeeded in bringing an investment of Rs. 1.73 Lakh Crores to the state, creating employment opportunities up to 13.02 Lakhs.Image may contain: one or more people and crowd

Minister highlighted the government’s efforts in boosting the investment by developing sector-specific Industrial parks focusing on Pharma, Medical Devices, Aerospace & Defence, MSME, Textiles, Food Processing, among others. With the new industries coming into the state, the government succeeded in creating lakhs of employment opportunities, he added.

Addressing the audience, Minister KTR said, “We are committed to industrialization in Telangana. With the support and guidance of investors of Telangana, we will continue to prosper and will continue to bring in new reforms which will reduce corruption, improve ease of doing business and will lower the cost of doing business in Telangana.”

During the program, Ministers KTR and Malla Reddy presented Awards to the District collectors for the best performing districts and departments in the implementation of TS-iPASS in the past five years.

Minister KTR also presented a cheque of Rs. 305 crores (subsidy amount) to T-Pride (Telangana State Program for Rapid Incubation of Dalit Entrepreneurs) at the 5th Anniversary Celebrations of TS-iPASS.

On the occasion, Minister congratulated all the departments and officers associated with TSiPASS.

Image may contain: 6 people, people sitting

శిల్పాకళావేదికలో టీఎస్‌ ఐపాస్‌ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్‌, మంత్రి శ్రీ మల్లారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీ జయేశ్‌ రంజన్‌, పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. టీఎస్‌ ఐపాస్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి మానసపుత్రిక అని స్పష్టం చేశారు. పారిశ్రామిక సంఘాలు, అధికారులతో సీఎం కేసీఆర్‌ ఒక రోజంతా చర్చించి.. టీఎస్‌ ఐపాస్‌కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను మారుస్తున్నాం. ఓఆర్‌ఆర్‌ వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్యుత్‌ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే విద్యుత్‌ సమస్యను అధిగమించాం. వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.

Image may contain: 11 people, people standing

కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు చెల్లిస్తాం. ఒక పరిశ్రమకు రాయితీ ఇస్తే వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. పరిశ్రమలకు రాయితీలు ఇస్తే పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్లు అపోహలు సృష్టించారు. చైనాతో పోటీ పడాలంటే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో పాటు మెగా పార్కులు ఉండాలి. హైదరాబాద్‌ ఫార్మాసిటీని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఫార్మా సిటీ కోసం 10 వేల ఎకరాలు సేకరించాం. ఎస్సీ, గిరిజన పారిశ్రామికవేత్తల రూ. 305 కోట్ల రాయితీలు అందజేశాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కార్మికులకు జీవనాధారం. మెగా పరిశ్రమలు 30 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈలు 70 శాతం వరకు ఉపాధిని కల్పిస్తున్నాయి. ప్రపంచంతో పోటీ పడాలంటే భారీ ప్రాజెక్టులు ఉండాల్సిందే. నిబద్ధతతో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నాం. పరిశ్రమల వద్దే ఉద్యోగుల నివాసాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అని కేటీఆర్‌ తెలిపారు.

Image may contain: 8 people, people standing

Image may contain: 5 people, people smiling, people standing