రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి శ్రీ కేటీఆర్ దర్శించుకున్నారు.

1Feb 2021

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి శ్రీ కేటీఆర్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు.

May be an image of one or more people, people standing and temple

May be an image of one or more people and people standing

May be an image of 3 people, people standing and text that says "MTHEN యణ స్థలం"

May be an image of 2 people, people standing, people sitting and indoor

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన మంత్రి శ్రీ కేటీఆర్
– ఆలయ, పోలీస్, రెవెన్యూశాఖల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలి
– నాలుగు నుండి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది
– సామాన్య భక్తులకు దర్శనం కల్పించడంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి
– జాతరకు వచ్చే విఐపి భక్తులకు ఒకే సమయం కేటాయించి అదే సమయంలో దర్శనం కల్పించాలి
దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలి
– ఆలయ వసతి గదులను భక్తులకు కేటాయించాలి
– జాతరకు భద్రత నిమిత్తం విధులకు వచ్చేవారికి ఇతరచోట్ల వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కు సూచన
– జాతరలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని ఆదేశం
– 3 లక్షల మాస్క్ లు ఉచితంగా అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలి. 25 చోట్ల ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
– వంద పడకల ఆస్పత్రిని మార్చి మొదటి వారంలోనే ప్రారంభించే విధంగా పనులు వేగవంతం చేయాలని ఆదేశం
– అన్ని శాఖల సమన్వయంతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పనులను షేర్ చేసుకోవాలని సూచన
– పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.. పరిసరాల పరిశుభ్రతను మున్సిపల్ అధికారులు కూడా పర్యవేక్షించాలి… సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ తో సమన్వయమై వారం రోజుల ముందే పట్టణం పరిశుభ్రంగా ఉండాలి
– రహదారులు కూడా ఎక్కడా గుంతలు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు
– వేసవి కాలం కావడంతో మిషన్ భగీరథ తాగునీరు… విజయ డైరీ తో మాట్లాడి మజ్జిగ ప్యాకెట్లు కూడా సమకూర్చుకోవాలని సూచించారు
– జాతరకు సంబంధించిన ఏదైనా ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా పోలీస్, ఫైర్ రెవిన్యూ, వైద్య ,ఆలయ అధికారులు మాక్ డ్రిల్ చేసుకొని ముందస్తుగా అప్రమత్తం కావాలని ఆదేశించారు
– రాజమండ్రి లాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు
– సాంస్కృతిక వేడుకలు కూడా యధావిధిగా నిర్వహిస్తామని ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు
– ఇరవై రోజుల తర్వాత నిర్వహించే సమీక్ష సమావేశానికి సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమై రావాలని మరోసారి మంత్రి కేటీఆర్ గారు అధికారులను ఆదేశించారు
– ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులకు కనీస కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఆలయంలో చర్యలు లేవని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు