Minister of Infrastructure, Alberta, Canada, Mr Prasad Panda called on IT and Industries Minister Sri KTR in Hyderabad

16Dec 2019

Minister of Infrastructure, Alberta, Canada, Mr Prasad Panda called on IT and Industries Minister Sri KTR in Hyderabad. Investment opportunities between Telangana State and Alberta Province were discussed in the meeting.

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీ రామారావుని కలిసిన కెనడాలోని అల్బెర్టా ప్రావిన్సు మౌళికవసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా.

అల్బెర్టా ప్రావిన్సు, తెలంగాణ మద్య వ్యాపార వాణిజ్య అవకాశాలపైన చర్చించారు. తెలంగాణలో ఐటి పరిశ్రమ రంగ అభివృద్ది గురించి చాలా సానుకూల ఫీడ్ బ్యాక్ ఉన్నదని, ఈ రంగంలో అల్బెర్టా ప్రావిన్సులోని పారిశ్రామిక వర్గాల నుంచి ఆసక్తి వ్యక్తం అవుతుందని ప్రసాద్ పండా తెలిపారు. కెనడా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలున్నాయని, తెలంగాణ పారిశ్రామిక విధానాలు, అవకాశాల గురించి తెలిపేందుకు కెనడాలో పర్యటించాలని ఆహ్వనించారు. అల్బెర్టా ప్రావిన్సు ప్రీమియర్ జేసన్ కెన్నీని తెలంగాణలో పర్యటించాల్సిందిగా కోరామని, వచ్చే ఏడాది ఇక్కడకు ఆయన వస్తారని తెలిపారు. అల్బెర్టాలో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని పండా మంత్రి కేటీఆర్ కు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు అనేక ఒడిదుడుకులు ఏదురైనా, ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపి, అధికారంలోకి వచ్చిన తీరు పట్ల ముఖ్యమంత్రిపైన వ్యక్తిగతంగా ఏంతో గౌరవం ఉన్నదని ఈ సందర్భంగా పండా మంత్రి కేటీఆర్ కు తెలిపారు. కెనడా దేశంలో సహజ వనరులు బలంగా ఉన్నాయని, భారత్ లో మానవ వనరులున్నాయని, ఈ రెండింటి కలయికతో మరిన్ని వ్యాపార అవకాశాలు ఏర్పడతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న టిఎస్ ఐపాస్ వంటి పాలసీల ద్వారా ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలను తెలంగాణకు రప్పించిన తీరుపైన మంత్రి కేటీఆర్ వివరాలు అదించారు.

Image may contain: 2 people, people sitting and indoor

ఈ సమావేశంలో పరిశ్రమ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డిలు పాల్గోన్నారు.