Minister Sri KTR held a review meeting on progress of Municipal works in Warangal & Khammam Municipal Corporation

4Jun 2020

Minister Sri KTR held a review meeting on the progress of Municipal works in Warangal & Khammam Municipal Corporations. Ministers Smt Satyavathi Rathod, Sri Puvvada Ajay, Sri Errabelli Dayakar Rao, MLC Sri Kadiyam Srihari, Chief Whip Sri Dasyam Vinay Bhaskar, MLA Sri Dharma Reddy, Principal Secretary Arvind Kumar participated.

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పైన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్ష

– త్వరలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల కమిషనర్లకు ఒకరోజు శిక్షణ సమావేశం
– పౌరుల కనీస అవసరాల కల్పనలో ముందుండాలని కార్పోరేషన్లకు సూచన
– మౌళిక వసతుల కార్యక్రమాల పురోగతిని సమీక్షించిన మంత్రులు
– మూడో వారంలో రెండు పట్టణాల్లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పైన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈసమావేశానికి మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ పువ్వాడ అజయ్, చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే శ్రీ ధర్మా రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి, మరియు ఖమ్మం వరంగల్ జిల్లాల కలెక్టర్లు, కార్పొరేషన్ల కమిషనర్లు హజరయ్యారు.

హైదరాబాద్ లోని ఏసీ గార్డ్స్ లోని పురపాలక శాఖ కాంప్లెక్స్ లో ఈ సమీక్ష సమావేశం జరిగింది. ఇరు కార్పొరేషన్లలో పౌరుల కనీస అవసరాల పైన ప్రధాన దృష్టి వహించాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల అమలుపైన మరింత చొరవ చూపాలని సూచించారు. మఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌసింగ్ కార్యక్రమం పైన ప్రధాన దృష్టి సారించి, ఎప్పటికప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతోపాటు, పట్టణంలోని ఇతర మౌలిక వసతుల కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లా మంత్రులకు కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లోనూ ప్రాధాన్యత క్రమంలో ముఖ్యమైన కార్యక్రమాలను వెంటనే పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ల కమిషనర్లకు ఆదేశించారు. అయా పనులు పూర్తయ్యే తేదిలతో కూడిన ఒక క్యాలండర్ ను రూపొందించాలన్నారు. అయా పనులు మరింత వేగంగా పూర్తయ్యేందుకు పురపాలక శాఖ తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

త్వరలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల కమిషనర్లకు ఒకరోజు శిక్షణ సమావేశం నిర్వహిస్తామన్నారు. పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాధాన్యతల గుర్తింపు పైన ఈ శిక్షణ సమావేశంలో నిపుణులులో చర్చిస్తామన్నారు.ఈ సమావేశం కోసం ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్ అదేశించారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల వారీగా చేపట్టిన వివిధ కార్యక్రమాలను మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా స్ధానిక మంత్రులు పట్టణంలో నడుస్తున్న పలు కార్యక్రమాల గురించి కేటీఆర్ కు వివరించారు. వరంగల్ ,ఖమ్మం పట్టణాల్లో రోడ్ల నిర్వహణతో పాటు, ఫుట్ పాత్ ల నిర్మాణం, గ్రీనరీ ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి, టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈరెండు పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీరు అందుతున్న తీరుపైన సమీక్షించిన మంత్రులు, ప్రస్తుతం ఈ పట్టణాల్లో చేపడుతున్న తాగునీటి సంబంధిత మౌలిక వసతుల కార్యక్రమాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు కార్పోరేషన్ల పరిధిలో విలీన గ్రామాల్లో నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలని మంత్రులు సూచించారు. ఈనెల మూడవ వారంలో వరంగల్, ఖమ్మం పట్టణాల్లో స్వయంగా పర్యటించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.