రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులపైన సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీ కెటి రామారావు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టిఎస్ఐఐసి చేపడుతున్న ప్రాజెక్టులపైన పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలతో పాటు, నగరం చుట్టుపక్కల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కులపైన ఈ సమావేశంలో మంత్రి వాటి పురోగతిని తెలుసుకున్నారు. దండు మల్కాపూర్ లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు దాదాపుగా ప్రారంభానికి సిద్దంగా ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. బండమైలారంలోని సీడ్ పార్కు, బండ తిమ్మాపూర్ లో పుడ్ ప్రాసెసింగ్ పార్కు, ఎల్ఈడీ పార్కు (శివనగర్) లో పనులు వేగంగా నడుస్తున్నాయని, ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశాయన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న అపరెల్ పార్కు పనుల పురొగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుల పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్కుల వివరాలు, వాటిలోకి వచ్చిన, రానున్న పెట్టుబడులు మొత్తం, ఉద్యోగ అవకాశాల వివరాలతో ఒక సమగ్రమైన నివేధిక తయారు చేయాలని మంత్రి టిఎస్ఐఐసి అధికారులను కోరారు. నగరంలో టిఎస్ఐఐసి చేపడుతున్న దుర్గం చెరువు సుందరీకరణ పూర్తి కావస్తున్నట్లు, టివర్క్ పనులు త్వరలో శంఖుస్థాపనకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
దీంతోపాటు పాత పారిశ్రామిక ఎస్టేట్స్ లో కంపెనీలు, వాటి ప్రస్తుత పరిస్ధితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎస్టేట్లో కార్యకలాపాలు నిలిపేసిన కంపెనీలతో టిఎస్ఐఐసి సమావేశం కావాలని మంత్రి ఆదేశించారు. జీ.వో 20 ప్రకారం కాలుష్యకారక పరిశ్రమలను నగరం అవతలకు తరలించాలన్న కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్, నాచారం, కాటేదాన్ మొదలయిన ప్రాంతాల్లోని పరిశ్రమలతో సమావేశం కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇలాంటి పరిశ్రామిక వాడల్లో ఉపాది కల్పించేలా ఐటి లాంటి నూతన రంగాల పరిశ్రమలను అభివృద్ది చేసేందుకు ఆయా కంపెనీల యాజమాన్యాలతో ప్రాథమికంగా సమావేశం అవ్వాలన్నారు. ఒక వేల పారిశ్రామిక వాడల్లోని వారంత ముందుకు వస్తే ఇలా నూతనంగా, కాలుష్యం లేని రంగాలకు ఆయా ప్రాంతాలకు మళ్లించేందుకున్న అవకాశాలను పరిశీలించాలన్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టిఎస్ఐఐసి ఎండి నర్సింహా రెడ్డి, ఇతర అధికారులు పాల్గోన్నారు.