13Jan 2020
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా మన్నె క్రిశాంక్, పాటిమీది జగన్, సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి లను నియమించారు.