Minister Sri KTR participated in Rajiv Gandhi University of Knowledge Technologies -Basara’s 5th Convocation Ceremony

10Dec 2022

బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదవ స్నాతకోత్సవానికి మంత్రులు శ్రీ కేటీఆర్‌, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎం శ్రీ కేసీఆర్ నేతృత్వంలో ఉన్నత విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తున్నామని, భవిష్యత్తులో అపారమైన అవకాశాలను అందించే డిజిటైజేషన్, డీకార్బనైజేషన్ మరియు డీసెంట్రలైజేషన్ (3D) పై దృష్టి పెట్టాలని పట్టభద్రులను మంత్రి కోరారు.

May be an image of 1 person, standing and indoor

పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే ఫలితాలు దక్కుతాయని వెల్లడించారు. విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. వర్సిటీలు డిజైనింగ్‌ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు.

ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామని అన్నారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థులకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ముఖ్యమని చెప్పారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్‌ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి మనం ఎదగాలని చెప్పారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

Minister Sri KTR participated in Rajiv Gandhi University of Knowledge Technologies -Basara’s 5th Convocation Ceremony as the Chief Guest along with his cabinet colleagues Smt Sabitha Indra Reddy and Sri Allola Indra Karan Reddy. Awarded degrees to the Graduating students, and gold medals to meritorious students.

Stating that Telangana Govt. led by CM Sri KCR is strengthening higher education ecosystem, the Minister asked the graduating students to focus on 3Ds – Digitisation, Decarbonisation and Decentralization, which will present immense opportunities in near future.

May be an image of one or more people, people standing and indoor

Requested Education Minister Sabitha Indra Reddy to introduce a practice school or apprenticeship model so that the students get industrial exposure while studying. Urged students to leverage T-Hub Research and Innovation Circle of Hyderabad – RICH facilities to walk in with an idea and walk out with a product.

Meanwhile, Minister KTR kept the promises made to RGUKT – Basara and its students in Sept., 2022. Along with his Cabinet colleagues, ceremoniously distributed laptops to Engg. students. About 2,200 laptops, 1,500 desktops readied to be given away to Engg. and P1 & P2 students.

May be an image of 12 people, people standing and text that says "Nirmal (Dist), Telangana 504107 TECHNOLOGIES BASAR FIFTH CONVOCATION 10th December, 2022 Chief"
May be an image of 14 people, people standing and text that says "Basar RAJIV GANDHI UNIVERSITY OF KNOWLEDGE TECHNOLOGIES BASAR Nirmal (Dist), Telangana 504107 FIFTH CONVOCATION 10th December, 2022 Guest akunth aral"