Ministers KTR, Vemula Prashanth Reddy, Gangula Kamalakar reviewed various municipal issues in Karimnagar & Nizamabad Municipal Corporations.

9Jun 2020

కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లో పైన సమీక్ష సమావేశం నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్

• హాజరైన మంత్రులు శ్రీ గంగుల కమలాకర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి మరియు కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు శ్రీ రసమయి బాలకిషన్, శ్రీ గణేష్ గుప్తా, శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి

• కార్పొరేషన్ పరిధిలోని పౌరుల కనీస అవసరాలను తీర్చడం పైన ప్రధాన దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన మంత్రి కేటీఆర్

• పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన

• కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్మశాన వాటికలు, పార్కులు ,జంక్షన్లలో అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశం

• ప్రస్తుతం రానున్న వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశం
• కరీంనగర్, నిజామాబాద్ పట్టణాల వాటర్ మ్యాప్ ని సిద్ధం చేయాలి
• రెండు కార్పొరేషన్లు వాటర్ మరియు ఎనర్జీ ఆడిటింగ్ రానున్న 15 రోజుల్లో పూర్తి చేయాలి

• ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలి

• పట్టణాల్లో ఉన్న ఖాళీ స్థలాల తోపాటు పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, అవకాశం ఉన్న ప్రతి చోట రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చేపట్టాలి

• పట్టణాల్లోని వేస్ట్ మేనేజ్మెంట్ పద్దతుల పైన సమీక్ష నిర్వహించుకుని ఆదర్శవంతమైన పద్ధతులను అందిపుచ్చుకోవాలి

• రెండు పట్టణాలు ఆధునిక స్లాటర్ హౌస్ లను ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి

• కరీంనగర్ పురపాలక శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం కరోనా కట్టడి విషయంలో అద్భుతమైన నిబద్ధత చాటారు. ఈ విషయంలో వారిని అభినందించిన మంత్రి కేటీఆర్

• హైదరాబాదులో ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం తరువాత స్థానికంగా కార్పొరేషన్లో వారీగా ఆయా జిల్లా స్థాయిలో ప్రత్యేక సమీక్ష సమావేశాలను నిరంతరం కొనసాగించాలని కోరిన మంత్రి కేటీఆర్

 

Image may contain: one or more people, people sitting and indoor

Image may contain: one or more people, people sitting, table and indoor

Image may contain: one or more people and people sitting