Ministers Sri KTR and Sri Vemula Prashanth Reddy held a high-level meeting with the heads of Cement Industries in Telangana
Ministers Sri KTR and Sri Vemula Prashanth Reddy held a high-level meeting with the heads of Cement Industries in Telangana. Chief Secretary Sri Somesh Kumar and Mayor Sri Bonthu Ramamohan participated.
Since 2016, the cement companies have been providing cement bags at Rs 230 for the construction of 2BHK Dignity Houses. Today, the representatives agreed to continue the same price on cement bags for construction of 2BHK houses & other Govt projects for next three years.
The Ministers agreed to set up a training center in affiliation with the National Academy of Construction at Huzurnagar. This will create skilled manpower by training the local youth of Huzurnagar, an area that has a large number of cement industries.
In the meeting, Ministers asked the representatives of the cement companies to reduce the price of cement bags to aid the real estate sector, which has been affected by the lockdown during the COVID19 pandemic. The representatives responded positively.
సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశం
• సిమెంట్ ధరను తగ్గించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన పైన సానుకూలంగా స్పందించిన సిమెంట్ కంపెనీల ప్రతినిధులు
• వారం రోజుల్లో అంతర్గతంగా చర్చించుకొని ప్రభుత్వానికి సానుకూల నిర్ణయం తెలుపుతామన్న ప్రతినిధులు
• మరో మూడు సంవత్సరాల పాటు 230 రూపాయలకే బస్తా చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రభుత్వ పథకాలకు సరఫరా చేసేందుకు అంగీకారం
• సిమెంట్ కంపెనీలు ఎక్కువగా ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం
• అవసరమైన సిబ్బందిని ఈ శిక్షణ కేంద్రం నుంచి తీసుకునేందుకు సిమెంట్ కంపెనీల అంగీకారం
• శిక్షణ కేంద్రానికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపిన సిమెంట్ కంపెనీలు
రాష్ట్రంలో సిమెంట్ బస్తా ధరలు తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ ప్రశాంత్ రెడ్డిలు రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేష్ కుమార్, హైదరాబాద్ నగర మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ -19, లాక్ డౌన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు సిమెంట్ బస్తా ధరను తగ్గించాలని మంత్రులు కోరారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం వలన అన్ని రంగాల మాదిరే రియల్ ఎస్టేట్ రంగం కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి రియాల్టీ రంగానికి చేయూతనిచ్చేందుకు ధరలను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు తెల్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియాల్టీ రంగం పైన అదనపు భారం పడితే అది అంతిమంగా సామాన్య ప్రజల పైన, వినియోగదారులపైనే పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగం వృద్ది పథాన కొనసాగిందని, ఇప్పుడు కూడా కొనసాగించాల్సిన అవసరం అందరిపైనా ఉందని ఈ సందర్భంగా సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు తెలియజేశారు. ప్రస్తుతం అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో నిర్మాణ రంగం ఒకటని ఈ రంగం ఒడిదుడుకులకు గురైతే అంతిమంగా ఈ ప్రభావం సిమెంట్ కంపెనీలపై కూడా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారికి గుర్తు చేశారు. మరింత సానుకూల భవిష్యత్తు కోసం వెంటనే సిమెంట్ బస్తా ధరను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. సిమెంట్ బస్తా ధరలు తగ్గించాలని ప్రభుత్వం చేసిన సూచనకు కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. అంతర్గతంగా మాట్లాడుకుని వచ్చే వారంలో ఏ మేరకు ధరను తగ్గించేది ప్రభుత్వానికి వారం రోజుల్లో తెలియజేస్తామని తెలిపారు.
గతంలో 2016లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి 230 రూపాయలకి ఒక బస్తా ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోను కూడా జారీ చేసింది. ఈరోజు జరిగిన సమావేశంలో మరో మూడు సంవత్సరాల పాటు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వ పథకాలకు 230 రూపాయల ధరకి యధావిధిగా సిమెంట్ సరఫరా చేసేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు.
దీంతోపాటు సిమెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున నెలకొని ఉన్న హుజూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో, అక్కడి యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షణ కేంద్రాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశంలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అధికారులకు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఆర్ అండ్ బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిమెంట్ కంపెనీలకు అవసరమైన సిబ్బందిని ఈ శిక్షణ కేంద్రం నుంచి తీసుకుంటామని, ఈ శిక్షణా కేంద్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సైదిరెడ్డి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి, శిక్షణ కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామన్న సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.