Ministers Sri KTR & Sri Harish Rao Thanneeru held a review meeting on issue of handloom weavers in erstwhile Medak dist.
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట చేనేత కార్మికుల సమస్యలపై మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి సమీక్షకు హాజరయ్యారు. సిద్దిపేట, దుబ్బాక నేతన్నల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో మంత్రులు చర్చించారు. టెక్స్‌టైల్ విభాగం తరపున ఇవ్వనున్న బతుకమ్మ చీరలను మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు. సిద్దిపేట గొల్లభామ చీరకు మరింత ప్రాచూర్యం తీసుకొచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూంలలో అందుబాటులో ఉంచుతామని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ వెల్లడించారు. నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, మగ్గాల ఆధునీకరణ వంటి కార్యక్రమాలను నేతన్నల దగ్గరకు తీసుకుపోయేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దుబ్బాక, చేర్యాల, సిద్దిపేటలో సొసైటీల భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు టెక్స్‌టైల్ విభాగం నిధులు అందజేస్తుందని తెలిపారు.