Ministers Sri KTR, Sri Prashanth Reddy, Sri Talasani Srinivas Yadav, Sri Malla Reddy & Sri Mohammed Mahamood Ali held a review meeting on the status of double bedroom dignity homes program in Hyderabad.

20May 2020

Speed up the construction of double bedroom dignity houses in Hyderabad: Minister KTR

Ministers Sri KTR, Sri Prashanth Reddy, Sri Talasani Srinivas Yadav, Sri Malla Reddy & Sri Mohammed Mahamood Ali held a review meeting on the status of double bedroom dignity homes program in Hyderabad.

Addressing the high-level meeting, MA&UD Minister KTR said, “The Telangana Government will handover 50 thousand double bedroom dignity houses to the beneficiaries by coming August.”

Minister KTR stated that the government aims at constructing one lakh double bedroom dignity houses for the poor in Hyderabad city. He mentioned that the works are fast in progress and the houses will be ready to occupy by Dussehra.

The working agencies informed the Ministers that despite the lockdown, the construction works are going at a good pace. The agencies mentioned that there are a few problems pertaining to steel, cement, and sand. Minister KTR assured the agencies that their problems will be solved soon. He asked the officials of MA&UD and Housing Departments to call for a special meeting with the working agencies to resolve their problems.

Minister KTR stated that 80 percent of construction works have been completed at various sites in the city, and a few houses have already been handed over to the beneficiaries.

Minister asked the officials to set up the external infrastructure such as power supply and water supply to the completed houses. “The completed houses should be handed over to the GHMC officials,” the Minister said.

Housing Minister Prashanth Reddy stated that a lion’s share of houses under the double bedroom program is being constructed in Hyderabad. He mentioned that there will be complete assistance provided to the GHMC from Health Department officials.

After the meeting, Minister Talasani Srinivas Yadav addressed the media and stated that instructions have been given to officials to complete the construction of 50 thousand houses by August and hand them over to the beneficiaries in GHMC limits.

Mayor Sri Bonthu Rammohan and Special Chief Secretary (Housing) Chitra Ramachandran, MA&UD Principal Secretary Arvind Kumar, HMWSSB MD Dana Kishore & GHMC Commissioner Lokesh Kumar were present in the meeting.

ఈ సంవత్సరం ఆగస్టు నాటికి హైదరాబాద్ నగరంలో 50 వేల మంది పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ తెలిపారు. ఈరోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం పైన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నగర మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ సిహెచ్ మల్లారెడ్డి, నగర మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ తో పాటు జీహెచ్ఎంసి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులు, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టిందని, ఈ మేరకు హైదరాబాద్ నగరంలోనే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించినట్లు ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమం పై నిరంతరం సమీక్షిస్తూ వాటి పురోగతిని పరిశీలిస్తున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్ రానున్న ఆగస్టు నాటికి 50 వేల ఇళ్లను హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో చేపట్టిన సుమారు లక్ష ఇళ్ల నిర్మాణ పురోగతిని మంత్రులు సమీక్షించారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నప్పటికీ నిర్మాణ పనులు నిరంతరం కొనసాగుతున్నట్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ వర్కింగ్ ఏజెన్సీలు మంత్రుల దృష్టికి తీసుకు వచ్చాయి. అయితే ప్రస్తుతం స్టీలు, సిమెంటు, ఇసుక వంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రుల దృష్టికి వర్కింగ్ ఏజెన్సీలు తీసుకువచ్చాయి. స్టీలు, ఇసుక, సిమెంట్ వంటి అంశాల పై ప్రభుత్వం వర్కింగ్ ఏజెన్సీలకు సహాయకారిగా ఉంటుందని ఈ మేరకు ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ, గృహ నిర్మాణ శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల 80 శాతానికిపైగా నిర్మాణాలు పూర్తయ్యాయని మిగిలిన సైట్లలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఇతర డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. నిర్మాణాలు పూర్తి అయిన చోట వెంటనే విద్యుత్ మరియు తాగునీరు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తయిన సైట్లను వెంటనే జిహెచ్ఎంసి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

Image may contain: one or more people and people sitting