Minister KTR addressed the Sarpanches and Panchayat Secretaries at Panchayati Raj Sammelanam program in Sircilla & Vemulawada.

21Feb 2020

Minister KTR addressed the Sarpanches and Panchayat Secretaries at Panchayati Raj Sammelanam program in Sircilla & Vemulawada.

స్వరాష్ట్ర సాధన అనంతరం కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను ఏర్పాటుచేసుకొని బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నామన్నారు. వీటికోసం శాశ్వత భవనాల నిర్మాణం, పాలనా యంత్రాంగం సమకూర్పుతో ప్రజలకు పాలన చేరువయ్యేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పారు. ప్రజలకు సీఎం కేసీఆర్‌ పాలనపై సంపూర్ణ విశ్వాసం ఉన్నదని.. పనిచేసే ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో సీఎం ఉండిపోయారన్నారు.

Image may contain: 4 people, people standing

అభివృద్ధి అంటే కేవలం నిధులు మంజూరుచేయడం కాదని.. ప్రజలకు తగిన మౌలిక వసతులు కల్పించి తద్వారా సుపరిపాలన అందించడమని పేర్కొన్నారు. గ్రామాలను బాగుచేసుకోవడాన్ని ప్రజాప్రతినిధులు బాధ్యతగా భావించడంకోసమే కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్టాలను సీఎం కేసీఆర్‌ రూపొందించారన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో అమలుచేస్తే రాష్ట్రం మరింతగా ముందుకు వెళ్తుందని చెప్పారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ సుంకే రవిశంకర్, శ్రీ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత, మెరుగైన పౌరసేవలను ప్రజలకు అందించేందుకు ఈ నెల 24 వ తేదీ నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అన్ని పురపాలక సంఘాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న నేపధ్యంలో ఈ రోజు వేములవాడ పట్టణంలో జరిగిన పట్టణ ప్రగతి సమ్మేళనంలో సిరిసిల్ల, వేములవాడ పురపాలక సంఘం అధ్యక్షులు, వార్డు కౌన్సిలర్లు, అధికారులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ చేన్నమనేని రమేష్ గారితో కలిసి దిశానిర్దేశం చేసిన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్

Image may contain: 10 people

Image may contain: 13 people, wedding and outdoor

Image may contain: 8 people, people standing

Image may contain: 14 people, crowd and indoor

Image may contain: 8 people, people standing and indoor