Party Working President Sri KTR Review with Party Leaders.

11Jan 2020

Party Working President Sri KTR Review with Party Leaders.

అత్యధిక పురపాలికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యం – పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్
– మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులతో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ సమీక్షా సమావేశం
– గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సూచన
– పురపాలికల్లో వచ్చిన నామినేషన్ల సంఖ్య, వివిధ పార్టీల బలాబలాలను పట్టణాల వారీగా అడిగి తెలుసుకున్న కేటీఆర్
– ఇంటింటి ప్రచారంపైన ప్రధాన దృష్టి సారించాలని నాయకులకు సూచన
– పార్టీ ఇంచార్జీలు, పట్టణాలకు ఆనుకొని ఉన్న గ్రామాల టీఆర్ఎస్ నాయకుల సేవలు ప్రచారంలో వాడుకోవాలి
– ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలే ఏజెండాగా ప్రచారం నిర్వహించాలి

Image may contain: 3 people, people sitting, table and indoor

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులతో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్ లో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులతో సమావేశమై మున్సిపల్ ఎన్నికలపైన చర్చించారు. ఒక్కో నాయకుడితో ప్రత్యేకంగా సమావేశమై స్థానికంగా ఎన్నికల కోసం నడుస్తున్న కార్యాచరణపైన, క్షేత్రస్థాయి ప్రచారం, అభ్యర్ధుల ఎంపిక, పార్టీ విజయం కోసం అనుసరిస్తున్న వ్యూహాలపైన చర్చించారు. ఇప్పటికే నామినేషన్లు పూర్తయిన నేపథ్యంలో ప్రచారం పైన ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి, పార్టీ అద్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో నిర్వహించిన పార్టీ సమావేశాల్లో చేసిన మార్గదర్శనం మేరకు పనిచేయాలని సూచించారు. అభ్యర్ధుల ఎంపిక, భి ఫారాల అందజేత విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. నామినేషన్ పూర్తయినాక అయా పట్టణాల్లో వచ్చిన నామినేషన్లు, పార్టీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్ధుల సంఖ్య, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నుంచి రెబెల్ అభ్యర్ధులుగా పోటీలో ఉండే వారితో నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. పురపాలికల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రచారం ఉండాలన్నారు. ప్రతి ఇంటికి టీఆర్ఎస్ పార్టీ ప్రచారం, అభ్యర్ధి చేరేలా ప్రచార కార్యాచరణ ఉండాలన్నారు. పార్టీ ప్రచార సామాగ్రి చేరవేత వంటి అంశాలపైన పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలకు దగ్గర ఉన్న గ్రామీణ ప్రాంతాల పార్టీ నాయకుల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. పార్టీ ఇంచార్జీలు ఎన్నికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని కేటీఆర్, ఎమ్మెల్యేలకు తెలిపారు. పార్టీ ఇంచార్జీలు లేని మున్సిపాలిటీల్లో పార్టీ నాయకుల సేవలు అందిస్తామని తెలిపారు.

ఈ సమావేశాల సందర్భంగా స్థానికంగా అయా పట్టణాల్లో ఉన్న పరిస్ధితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయం ఖాయం అని, పట్టణ ప్రజల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తుందని ఎమ్మెల్యేలు తెలిపారు. అయినప్పటికీ రానున్న పది రోజులు కష్టపడి పనిచేయాలని, ఎన్నికలను ఈజీగా తీసుకోవద్దని సూచించారు. గెలుపు ఖాయం అయినా పెద్ద ఎత్తున స్ధానాలు గెలుచుకునేలా కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు కేటీఆర్ సూచించారు. మంత్రులతో సమావేశం సందర్భంగా అయా జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల విజయం కోసం పనిచేయాలని, దీన్ని వ్యక్తిగత భాద్యతగా తీసుకోవాలని సూచించారు. మంత్రులు సైతం తమ పరిధిలోని పురపాలికల్లో జరుగుతున్న ఎన్నికల సన్నాహాలు, ప్రచారం, పరిస్ధితులను కేటీఆర్ గారికి వివరించారు. అత్యధిక పురపాలక సంఘాల ఎన్నికలున్న మంత్రి మల్లారెడ్డి తన పరిధిలోని మున్సిపాలీటీలు, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ విజయం ఖాయమని కేటీఆర్ కు తెలియజేశారు.

Image may contain: 2 people, people sitting

కేటీఆర్ గారితో సమావేశం అయిన నాయకులు – మంత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి, శ్రీ మల్లారెడ్డి, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శ్రీ రంజిత్ రెడ్డి, శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్ గుప్తా, శ్రీ రెడ్యా నాయక్, డాక్టర్ శ్రీ సంజయ్ కుమార్, శ్రీ కోనేరు కోనప్ప, శ్రీ దివాకర్ రావు, శ్రీ దుర్గం చిన్నయ్య, శ్రీ రవిశంకర్, శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, శ్రీ గాదరి కిషోర్, శ్రీమతి గొంగిడి సునీత, శ్రీ విట్టల్ రెడ్డి, శ్రీ సుధీర్ రెడ్డి, శ్రీ నోముల నర్సింహయ్య, శ్రీ జైపాల్ యాదవ్, శ్రీ క్రాంతి కిరణ్, శ్రీ రవీంద్ర కుమార్ పలువురు ఎమ్మెల్సీలు, తదితరులుతో మంత్రి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.