Pattana Pragathi program a huge success: Minister KTR

6Mar 2020

Pattana Pragathi program a huge success: Minister KTR

Addressing the Additional Collectors today in Hyderabad, MA&UD Minister Sri KTR said, “Pattana Pragathi Program is the step towards the upliftment of towns and cities of Telangana.”

Minister KTR held a review meeting with the Additional Collectors of all districts at MCRHRD Institute in Hyderabad. On completion of the Pattana Pragathi program, the Minister reviewed the works of each district and enquired about the status of works with the additional collectors.

The Minister said that the Pattana Pragathi program has played a major role in bringing development in the towns and cities. The program has helped in identifying civic problems that have been prevailing since long. Minister instructed the officials to come up with an action plan to resolve the identified problems. He instructed the officials to focus on green plans, sanitation plans, and water audits.

Minister also mentioned that a lot of problems pertaining to sanitation have been addressed during the ten-day program, which has shown great results in a short span.

Minister stated that the program has played a crucial role in bringing awareness amongst the citizens on the new municipal act.

Minister KTR instructed the officials to develop model markets, parks, dump yards, public toilets, street vendors zone, nurseries, modern burial grounds, crematoriums, urban lung spaces, open gyms in all the towns and cities.

Minister stated that the Additional Collectors should have complete knowledge about the municipalities which come under their limits and asked them to come up with proper plans to develop the towns and cities. Soon a meeting will be held with all the additional collectors to review the plans.

The Minister thanked all the departments, officials and the citizens who actively took part in the program and made it a huge success.

పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతం – పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్

• పట్టణాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంలో పట్టణ ప్రగతి కార్యక్రమం తొలి అడుగుగా భావిస్తున్నామన్న మంత్రి
• పదిరోజుల కార్యక్రమం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది
• ముఖ్యంగా నూతన మున్సిపల్ చట్టం పైన ప్రజల్లో అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి విజయం సాధించింది
• పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ లో అడిషనల్ కలెక్టర్లతో మంత్రి సమీక్ష
• పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం పని చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి, వివిధ శాఖల ఉద్యోగులకు పురపాలక శాఖ తరపున ధన్యవాదాలు తెలిపిన మంత్రి
• పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగిన తీరుపైన జిల్లాల వారీగా అడిషనల్ కలెక్టర్లతో మాట్లాడి సమీక్ష
• పట్టణాలను అదర్శ పట్టణాలుగా మార్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్దం చేయండి

పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో మార్పుదిశగా ఒక ముందడుగు పడిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన తొలి దశ పట్టణ ప్రగతి విజయవంతం అయ్యిందని తెలిపారు. పదిరోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా కలిసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రయత్నం చేశారన్నారు. పట్టణాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంలో పట్టణ ప్రగతి కార్యక్రమం తొలి అడుగుగా భావిస్తున్నామని తెలిపారు. ఈ పదిరోజుల కార్యక్రమం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. ఒక మంచి మార్పుకు బీజం పడిందన్నారు. ప్రభుత్వం పుర ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ముఖ్యంగా నూతన మున్సిపల్ చట్టం పైన ప్రజల్లో అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి విజయం సాధించిందని మంత్రి తెలిపారు.

పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలపై ఈరోజు హైదరాబాద్ లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాల అడిషనల్ కలెక్టర్లతో పాటు వివిధ విభాగాల అధిపతులు, పురపాలక శాఖ ముఖ్య అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం పని చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి, వివిధ శాఖల ఉద్యోగులకు పురపాలక శాఖ తరపున మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన అనేక దీర్ఘకాలిక సమస్యలను గుర్తించడం జరిగిందన్నారు. వీటితోపాటు వెంటనే పరిష్కారం చేయగలిగిన పారిశుద్ధ్యం వంటి సమస్యలను ప్రగతి కార్యక్రమంలో భాగంగా పరిష్కరించామన్నారు. అయితే గుర్తించిన సమస్యలను భవిష్యత్తులో ప్రణాళికబద్దంగా పరిష్కరించేందుకు పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం పట్టణాల్లో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం వార్డు కమిటీలతోపాటు పట్టణ ప్రజలను భాగస్వాములను చేస్తూ, వారిని నిరంతరం చైతన్య పరుస్తూ ముందుకు పోవాలని సూచించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగిన తీరుపైన జిల్లాల వారీగా అడిషనల్ కలెక్టర్లతో మాట్లాడి సమీక్షించారు. ఈ సందర్భంగా నూతన పురపాలక చట్టం తప్పనిసరి చేసిన ప్రాథమిక కార్యక్రమాల ఆమలుపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వార్డు పారిశుద్ద్య ప్రణాళిక, పట్టణ/నగర పారిశుద్ద్య ప్రణాళిక, పట్టణ వాటర్ ఆడిట్, పట్టణ హరిత ప్రణాళిక వంటి కార్యక్రమాలపైన ప్రధాన దృష్టిసారించాలన్నారు.
ప్రస్తుత మున్సిపాలిటీలో ఉన్న మౌళిక వసతులు, పౌర సౌకర్యాలపైన ఒక సంపూర్ణ నివేదిక రూపొందించాలని, దీంతోపాటు ఆయా మున్సిపాలిటీలను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఒక రోడ్ మ్యాప్ రూపొందించుకుని, ఆ దిశగా పనిచేయాలన్నారు. ఇందులో భాగంగా మోడల్ మార్కెట్లు, పార్కులు, డంపుయార్డులు, పబ్లిక్ టాయిలెట్స్, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, నర్సరీలు, స్మశానవాటికలు, అర్బన్ లంగ్ స్పేస్, ఒపెన్ జిమ్స్ మొదలైన సౌకర్యాలను ఖచ్చితంగా ఉండేలా చూడాలన్నారు. ఇందుకోసం రానున్న నాలుగు సంవత్సరాలకు సంవత్సరం వారీగా దశల వారీగా పూర్తి చేసేందుకు వీలున్న అంశాలను ముందే నిర్ధేశించుకోవాలన్నారు. ఏ పట్టణమైనా ఒకే రోజు ఆదర్శపట్టణంగా మారదని, అయితే ఆ దిశగా నిరంతరం అభివృద్ది కొనసాగించాలని మంత్రి తెలిపారు. ప్రతి అడిషనల్ కలెక్టర్ కు తన పరిధిలో ఉన్న అన్ని పురపాలక పట్టణాల గురించి తెలిసి ఉండాలన్నారు. మరోసారి పురపాలికలపైన సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్న మంత్రి, ఆ సమావేశం నాటికి పూర్తి స్ధాయి ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని సూచించారు.

Image may contain: 6 people, people sitting

Image may contain: one or more people and people sitting

Image may contain: people sitting

Image may contain: 4 people, people sitting and indoor