11Jan 2019
వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన దంపతులు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన యాదాద్రి జిల్లా కు చెందిన వృద్ధ దంపతులు. కోటి రూపాయలతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు సిద్ధమన్న ఆశ్రమ నిర్మాతలు మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి మరియు జానకమ్మ దంపతులు. దంపతుల దాతృత్వాన్ని, సేవా దృక్పథాన్ని కొనియాడిన కేటీఆర్. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వృద్ధాశ్రమం కొనసాగేలా సహకారం అందిస్తామన్న కేటీఆర్.