Telangana government is committed to the welfare of SC, ST communities: Ministers Koppula Eshwar, Satyavathi Rathod and KTR

7Oct 2020

Ministers Sri Koppula Eshwar, Smt Satyavathi Rathod, and Sri KTR held a high-level meeting on welfare schemes being provided by the Telangana Government to the SC and ST communities in the state. SC, ST Commission Chairman Errolla Srinivas, and MLA Balka Suman were present in the meeting.
Ministers launched the SC, ST commission website and inaugurated the renovated office today.
During the meeting, Minister KTR spoke about the policies for the welfare of the SC, ST communities in the state under the leadership of CM Sri KCR. He stated that only by strengthening the financial conditions of these communities eradication of the caste system can it be possible in the country. And to achieve this, the governments need to introduce schemes and policies to encourage young SC, ST entrepreneurs.
Minister KTR stated that the government has already assisted about 36 thousand SC, ST youth through T Pride.
In the meeting, a total of Rs 100 crore subsidy amount from the Industries department was released which will help 2000 beneficiaries from the communities. The ministers handed over the cheques to the beneficiaries today.
Minister KTR mentioned that the Telangana government plans to uplift and stand by the weaker sections by providing education, entrepreneurship, and employment opportunities.
Minister KTR instructed the officials to come up with the best policies to encourage SC and ST entrepreneurs. The officials were also asked to study the policies being implemented in various other states.
Minister KTR stated that a meeting will be soon called to discuss the drafting of the innovative policies for the upliftment of the SC, ST communities. Minister said that these plans will be placed before the hon’ble CM for approval. He also asked the officials to take up awareness programs in rural areas and educate the rural youth with the present policies and schemes.
Minister KTR appreciated the SC, ST commission for its efforts since its inception. He also appreciated them for proactively reaching out and extending support in cases related to atrocities against SC, ST communities. He appreciated Errola Srinivas and the entire staff of the SC, ST commission
Minister for Scheduled Castes Development, Koppula Eshwar stated that the commission has resolved 92% of the received cases and has actively toured districts and supported the people whenever they needed assistance.
Minister for ST Welfare Satyavathi Rathod stated that the SC, ST commission is working as per the vision of CM KCR. She also stated that the Chief Minister ST Entrepreneurship scheme is playing a key role in providing assistance and transforming ST youth into entrepreneurs.
SC, ST Commission Chairman Errola Srinivas stated that the earlier governments never cared for the SC, ST Commission before state formation. But the Telangana government has set up an office with complete infrastructure, he said. Mr. Srinivas informed the ministers about the programs being implemented by the Commission.
He stated that the public representatives and officials from across the state are supporting the commission. He said that the commission will work as per vision CM KCR has towards the development of SC, ST communities.
An MoU was also signed between WE Hub and Tribal Welfare Department in the presence of Ministers to ground and scale tribal women led enterprises. As per the MoU, TRICOR and WE Hub will set up 3 pre incubation centers in the ITDA regions of Telangana.
The ministers handed over the Rs 100 crore bank guarantee documents to the Telangana SFC granted by National Scheduled Caste Finance Development Corporation.
తమ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. ఇప్పటికే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రెండు వర్గాలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతున్నదని కేటీఆర్ తెలిపారు. ఒకవైపు వారి ప్రాథమిక అవసరాలైన విద్యా రంగంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూనే, మరోవైపు వారి అభివృద్ధి కోసం వారిని పెద్ద ఎత్తున ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో వివిధ శాఖల సెక్రటరీలు మరియు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీమతి సత్యవతి రాథోడ్ లతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమీషన్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరంతోపాటు, వెబ్ సైట్ ను మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ తన ఆలోచనలను పంచుకున్నారు. దేశంలో కులాన్ని మూలధనంతోనే రూపుమాపే అవకాశం ఉన్నదని, ఆ దిశగా సాధ్యమైనంత ఎక్కువ మంది దళిత, గిరిజన వర్గాల నుంచి యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే టీ-ప్రైడ్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఈ రెండు వర్గాల యువకులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సుమారు రెండు వర్గాల్లో కలిపి ఇప్పటికే 36 వేల మందిని జౌత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు యూనిట్లు ఇచ్చామని తెలిపారు. వీరందరికి త్వరలోనే సబ్సీడీలను అందిస్తామన్నారు. ఈరోజు సూమారు 2000 మందికి అవసరం అయిన 100 కోట్ల సబ్సిడీ మెత్తాన్ని పరిశ్రమల శాఖ తరఫున విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంత్రులు చెక్కులను అందించారు. సమాజంలో ఉన్నవారు, లేనివారు అనే తేడా ప్రధానంగా మారిందని, ఆర్థికంగా అవకాశాలు లేని వారికి అవకాశాలు కల్పించే విధంగా పని చేస్తామన్నారు. ఎడ్యుకేషన్, ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్, ఎంప్లాయిమెంట్ అనే 3 E సూత్రంతో నిమ్న వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టిన భారీ ప్రాజెక్టులు, ఇతర పాలనా సంస్కరణ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని తెలిపిన కేటీఆర్, దళిత, గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా, పెట్టుబడి అవకాశాలు కల్పించే విషయంలోనూ అంతే ఆదర్శంగా ఉండాలి అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అవలంభిస్తున్న కార్యక్రమాలు, చర్యలను పునః సమీక్షించి, దేశంలో ఇతర రాష్ట్రాలు అవలంభిస్తున్న కార్యక్రమాలన్నింటి పైన అధ్యయనం చేసి దేశంలోనే ఆదర్శవంతమైన విధానంతో ముందుకు రావాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచనలు చేశారు. తన పరిధిలో ఉన్న పరిశ్రమల శాఖ, మరియు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లు కలిసి ఈ దిశగా పని చేయాలన్నారు. త్వరలోనే మరోసారి సమావేశమవుతామని అధికారులకు సూచించారు. అలోగా వినూత్నమైన విధానాలతో ముందుకు వస్తే ముఖ్యమంత్రిగారి అనుమతితో మరింత ప్రభావవంతమైన పాలసీలతో ముందుకు పోదామని సూచించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకాలు, కార్యక్రమాల ద్వారా దళిత, గిరిజన యువకులకున్న అవకాశాలపైన అన్ని జిల్లాల్లో అవగాహణ మేళాలు నిర్వహించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పడిన నాటి నుంచి చేపట్టిన చర్యలను మంత్రి కేటీఆర్ అభినందించారు. ముఖ్యంగా దళిత గిరిజనుల పైన జరుగుతున్న అట్రాసిటీలను, వాటికి సంబంధించిన కేసులను పరిష్కరించి, వారికి తక్షణ సహకారం అందించడం వంటి చర్యలు ప్రశంసించారు. తమకు అప్పజెప్పిన భాద్యతలను నిబద్ధతతో ముందుకు తీసుకుపోతున్న కమీషన్ చైర్మన్, సభ్యులను అభినందించారు. ముఖ్యంగా ఈ విషయంలో కమిషన్ మరియు కమిషన్ సభ్యులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవడాన్ని మంత్రి అభినందించారు
ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారిని అభినందించారు. గతంలో కూడా కమిషన్లు ఉన్నా..మొక్కుబడిగా ఉండేవని, రాజకీయ నాయకుల పునరావాసంగా ఉండేవని, కానీ సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు నేడు ఈ కమిషన్ పని చేయడం సంతోషంగా ఉందన్నారు. కమీషన్ వద్ద పెండింగ్ లో ఉన్న 92 శాతం కేసులను పరిష్కరించడం, జిల్లాల్లో పర్యటించడం వంటి చర్యలతో కమీషన్ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. తాజాగా బీసీ కమిషన్ కూడా 17 సంచార జాతులు గుర్తించి వారిని జాబితాలో చేర్చాలి అని ప్రతిపాదించడం కూడా గొప్ప విషయమన్నారు. స్పృహ ఉన్న నాయకులు, సామాజిక బాధ్యత ఉన్న నాయకులు మంచి స్థానాల్లో ఉంటే ఎంత గొప్పగా పని చేస్తారనే దానికి ఎస్సీ, ఎస్టీ కమీషన్ పనితీరు నిదర్శనమన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ బాగా పని చేయడం పట్ల కమిషన్ చైర్మన్, సభ్యులను అభినందించారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ఈ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు ఇక్కడ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళిత, గిరిజన అభ్యున్నతికి సీఎం కేసీఆర్ గారు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ పరిధిలో వచ్చే అన్ని సమస్యలను పరిష్కరించడంలో నేరుగా మనమే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. వారి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం పట్ల మరింత పెంచే విధంగా కృషి చేయాలని కమీషన్ కు సూచించారు. సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకం పెట్టి గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా మార్చుతున్నామని, ఎక్కువ మంది గిరిజన యువకులను పారిశ్రామిక వేత్తలు చేయడానికి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
ఈరోజు కమీసన్ నూతన సమావేశం మందిరాన్ని ప్రారంభించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అందుతున్న కార్యక్రమాలను సమీక్షించడానికి మంత్రులు రావాడం పట్ల రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్ వారికి దన్యవాదాలు తెలిపారు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు కనీస వసతులు లేని పరిస్థితి ఉండేదని, ఈరోజు దేశంలోనే ఏ కమీషన్ కు లేని విధంగా అన్ని హంగులతో కూడిన కార్యాలయం తమకున్నదని అన్నారు. ఈ సందర్భంగా కమీషన్ చేపట్టిన కార్యక్రమాలను శ్రీనివాస్ మంత్రులకు వివరించారు. కమీషన్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం ఎప్పటికప్పుడు నిర్వహించడం గొప్పగా భావిస్తున్నామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు తమకు అన్యాయం జరిగితే నేరుగా కమిషన్ వద్దకు రావడం పట్ల మేము చాలా గర్వంగా భావిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞులమై ఉంటామని తెలిపారు. పేద ప్రజలకు దగ్గర కావడం, కమిషన్ ద్వారా వారికి న్యాయం చేయడం, ప్రయోజనాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కమీషన్ కు భాగా సహకరిస్తున్నారని తెలిపారు. భవిష్యత్ లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం మేరకు రాష్ట్రంలోని దళిత, గిరిజన వర్గాలకు ఈ కమిషన్ ద్వారా జరిగే పూర్తి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని మా కమిషన్ తరపున హామీ ఇస్తున్నామనని తెలిపారు.
ఐటీడీఏలలో ప్రి ఇంక్యుబేషన్, రీ ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటుకు ట్రైకార్, వి-హబ్ ఒప్పందం జరిగింది. దీంతో గిరిజన పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తారు. నేషనల్ షెడ్యూల్ కాస్ట్ పైనాన్స్ డేవలప్ మెంట్ కార్పోరేషన్ ఇచ్చే రుణాలకు సంబందించి తెలంగాణ యస్ ఎఫ్ సి కి వంద కోట్ల బ్యాంకు గ్యారంటీకి సంబంధించిన పత్రాలను మంత్రులు అందించారు.