టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పార్లమెంట్ సభ్యులకు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపైన దిశానిర్దేశం చేశారు.

15Nov 2019

టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఈ సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు.

తెలంగాణ ప్రయోజనాలే టీఆర్ఎస్ పార్టీ పరమావధి- పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్

• తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
• శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ వ్యూహం పైన దిశానిర్ధేశం
• పార్లమెంట్ సమావేశాల్లో రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన విభజనచట్టం హమీలను, పెండింగ్ తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను లేవనెత్తాలని నిర్ణయం
• అంశాల వారీగా పార్టీ వైఖరి ఉంటుందని, అంతిమంగా తెలంగాణ రాష్ర్ట ప్రయోజనాలే పరమావధిగా పార్టీ నిర్ణయం ఉంటుందన్న శ్రీ కేటీఆర్
• కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు, నిధులు వంటి అంశాలపైన ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన
• ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, అభివద్ది కార్యక్రమాలు, గణాంకాలతో ఎప్పటికప్పుడు ఎంపీలకు సమగ్ర సమాచారం అందించేందుకు అన్ని హంగులతో కార్యాలయం
• దేశ రాజదానిలో పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్
• తొలిసారి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అద్యక్షత వహించిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్
• కేటీఆర్ గారికి పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ కె. కేశవరావు స్వాగతం

Image may contain: 6 people, people sitting, table and indoor

ఈసారి పార్లమెంటరీ సమావేశాల్లో విభజనచట్టంలో పేర్కొన్న హమీలు, పెండింగ్ తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను లేవనెత్తాలని నిర్ణయం తీసుకున్నారు. చట్టంలో పేర్కొన్న మేరకు ఏర్పాటు చేయాల్సిన ఐఐయం లాంటి విద్యాసంస్ధలు, బయ్యారం ఉక్కు కర్మాగార ఏర్పాటు వంటి విభజన హమీలను, మిషన్ భగీరథకు కేంద్ర నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి తెలంగాణ ప్రభుత్వ విజ్జప్తులను ఈ సమావేశాల్లో పాలో అప్ చేయాలని శ్రీ కేటీఆర్ సూచించారు. పార్లమెంట్ లో అంశాల వారీగా టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉంటుందని, అంతిమంగా తెలంగాణ రాష్ర్ట ప్రయోజనాలే పరమావధిగా పార్టీ నిర్ణయం ఉంటుందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల నుంచి అనేక అంశాల మీద కేంద్ర ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాసిందని, అందులో హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రక్షణ భూముల బదలాయింపు, ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా వంటి తక్షణ అవసరం అయిన అంశాలపైన ఎంపీలు పనిచేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన పలు విజ్ఞప్తులపైన కేంద్ర మంత్రులు గతంలో హమీ ఇచ్చారని, కానీ చాలకాలంగా అవి అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, ఇలాంటి వాటిని ఫాలో అప్ చేయాలన్నారు. దీంతోపాటు శాఖల వారీగా తెలంగాణ ప్రభుత్వ డిమాండ్లు, వినతుల జాబితాను పార్టీ ఎంపీలకు అందిస్తామని, దీంతో వాటిని డీల్లీలో పాలోఅప్ చేసేందుకు తెలంగాణ మంత్రులు- ఎంపీల మద్య సమన్వయం సులభం అవుతుందన్నారు.

Image may contain: 3 people, people sitting, table and indoor

కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులు, నిధులు, కోచ్ ఫ్యాక్టరీ వంటి దీర్ఘకాలిక డిమాండ్లను కేంద్ర దృష్టికి తీసుకుపోయేందుకు ఇప్పటి నుంచే పనిచేయాలన్నారు. పలు స్టాండింగ్ కమీటీల్లో సభ్యులుగా ఉన్న యంపిలు అయా శాఖల్లో ఉన్న పథకాలను, ప్రయోజనాలను తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలన్నారు.
యంపిలు తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న దీర్ఘకాలిక డిమాండ్ లపైన సభలో ఖచ్చితంగా మాట్లాడాలని సూచించారు. దీంతోపాటు ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, గణాంకాల వివరాలు ఎంపీలకు అందుబాటులో ఉంచేందుకు, అయా అంశాలపైన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు అన్ని హంగులతో కూడిన కార్యాలయాన్ని ఎర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే పార్టీకి అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు ఉన్నాయని, దేశ రాజధానిలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తామని, ఈ విషయంలో పార్టీ ఎంపీలు చురుగ్గా దృష్టి సారించాలన్నారు.