TRS Party Working President KTR along with Karimnagar MP candidate Sri Vinod Boianpalli, Minister Eatala Rajender participated in a public meeting in Sircilla constituency.

25Mar 2019

కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి  వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ జెడ్పి చైర్మన్ శ్రీమతి తుల ఉమ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ

* కాంగ్రెస్ పార్టీ నేతలకు ఢిల్లీలో గులాంగిరి తప్ప గల్లీల్లో ఉన్న ప్రజల బాధలు పట్టవు
* ఇద్దరే ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మా నాయకునికి, 16మంది ఎంపీలను అందిస్తే ఏదయినా సాధించగలడు.
* ఏ సర్వే చూసినా మోదీ వేడి చల్లారింది. కాంగ్రెస్ కనుమరుగయింది. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా.
* ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతీ ఎంపీ ఎంతో ముఖ్యం కీలకం కాబోతున్నారు.
* కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రధాని మోదీ జాతీయ హోదా ఇవ్వలేదు.
* కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పెద్దన్న పాత్ర పోషించాల్సిన మోదీ, కనీసం కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కూడా ఇవ్వలేదు.
* తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించని మోదీ గారికి మనం ఎందుకు ఓటేయ్యాలే.
* ఆషామాషీగా మాట్లాడటం కాదు, మన నేతన్నల గురించి ఆలోచించే వారు, రైతుల గురించి రైతు బంధు పథకం లాంటి పథకం పెట్టే వారు, * ఆడబిడ్డల కష్టసుఖాలను పంచుకునే కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి.
* మనం ప్రవేశ పెట్టిన రైతుబందును తెల్లారిలేస్తే మనల్నిఆడిపోసుకునే చంద్రబాబు ఏపీలో ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
* మోదీ గారు సైతం కిసాన్ సమ్మాన్ పేరుతొ జాతీయ స్థాయిలో రైతుబంధు పథకాన్ని పెట్టడం జరిగింది.
* తెలంగాణాలో సంక్షేమ రంగం అద్భుతంగా ఉంది.
* ఎంపీ వినోద్ గారు అజాత శత్రువు. తెలంగాణ రాష్ట్ర అవసరాలు తెలిసిన వ్యక్తి. అలాంటి వినోద్ గారికి సిరిసిల్లలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని వేడుకుంటున్న అని కేటీఆర్ గారు తెలిపారు.

Image may contain: 1 person

Image may contain: 13 people, people smiling, crowd

Image may contain: 2 people, people standing

Image may contain: one or more people, crowd and outdoor

Image may contain: one or more people, crowd and outdoor

Image may contain: 17 people, people smiling, people standing

Image may contain: 12 people, people smiling, people standing and wedding

Image may contain: 12 people, people smiling, people standing

Image may contain: 17 people, people smiling, people standing

Image may contain: 18 people, people smiling, crowd