TRS Party working president KTR election campaign in Chevella Loksabha Constituency

10Mar 2019

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సభలో మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

* వచ్చే రెండు మూడేళ్లలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాము
* కాంగ్రెస్‌, బీజేపీని కాదని దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు.
* బీజేపీకి 100 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం లేదు.
* ఢిల్లీ గులాములు కాదు.. తెలంగాణ గులాబీలు గెలవాలి.
*చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

వచ్చే రెండు మూడేళ్లలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చేవెళ్ల సెగ్మెంట్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, రాహుల్‌ గాంధీ తిరిగారు. వాళ్లిద్దరు తిరిగినా కూటమి అభ్యర్థులు గెలవలేకపోయారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు.. మోదీకి, రాహుల్‌కు మధ్య ఈ ఎన్నిక జరుగుతుందని కాంగ్రెస్‌ అంటోంది.

కాంగ్రెస్‌, బీజేపీని కాదని దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, బీజేపీ చేసిందేమీ లేదు. మోదీ బోఫోర్స్‌ అంటే.. రాహుల్‌ రాఫెల్‌ అంటున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలు సీఎం కేసీఆర్‌ గారు చెప్పారు. మోదీ చెప్పిన సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌లో తెలంగాణ లేదు. తెలంగాణకు మోదీ సర్కార్‌ చేసిందేమీ లేదు. కాంగ్రెస్‌ పార్టీకి వంద సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. బీజేపీకి 100 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసినా కేంద్రంలో అధికారం చేపట్టలేరు. ప్రాంతీయ పార్టీలకు ఇదో మంది అవకాశం. అందుకే రాబోయే ఎన్నికల్లో ఒకటి, రెండు స్థానాలు కూడా కీలకం కాబోతున్నాయని కేటీఆర్‌ గారు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతి. కేసీఆర్‌ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందించాలనే ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారు. ఢిల్లీ గులాములు కాదు.. తెలంగాణ గులాబీలు గెలవాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లే. ఎవరు పార్టీలో చేరడానికి వచ్చినా దగ్గరకు తీయండి. మనస్పర్థలు పక్కనపెట్టి సమిష్టిగా విజయం కోసం కృషి చేయాలని కేటీఆర్‌ గారు పిలుపునిచ్చారు.

Image may contain: 1 person, aeroplane, sky and outdoor

Image may contain: 3 people, people smiling, people on stage and indoor

Image may contain: 12 people, people smiling

Image may contain: 16 people, people smiling

Image may contain: 1 person, standing and on stage

Image may contain: 1 person

Image may contain: 9 people, people smiling, people standing

Image may contain: 8 people, people standing

Image may contain: 1 person, stadium, sky, crowd and outdoor

Image may contain: 3 people, people smiling, people on stage and indoor

Image may contain: 8 people, wedding and indoor

Image may contain: 17 people, people smiling, wedding

Image may contain: 8 people, people smiling, people standing and indoor

Image may contain: 12 people, people smiling, indoor

Image may contain: 6 people, people smiling, people standing and indoor

Image may contain: one or more people, crowd and outdoor

Image may contain: 7 people, people smiling, indoor

Image may contain: 9 people, people smiling, indoor and food