TRS Party Working President KTR participated in a public meeting in Gambhiraopet, Sircilla

1Apr 2019

రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి  వినోద్‌ కుమార్ గారితో కలిసి పాల్గొన్నారు.

సభలో కేటీఆర్ మాట్లాడుతూ…

-కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర నిధులు సక్రమంగా అందాలంటే మన బలం ఉండాలి. ఈ సారి జరిగే పార్లమెంట్ ఎన్నికలు కీలకమైనవి. 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో మన సత్తా చాటవచ్చు.

-కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతుల అభివృద్ధి అంటూ కేవలం నినాదాలకే పరిమితం అయ్యాయి. రైతులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమే. కేసీఆర్ పథకాలను చూసే ఇతర రాష్ర్టాలు, కేంద్రం కూడా అనుసరిస్తోంది. రైతుబంధు, రైతు బీమాలతో రైతులకు అండగా ఉంటున్నాం.

-ఆదాయం పెంచాలే… పేదలకు పంచాలే అన్న లక్ష్యమే సీఎం కేసీఆర్‌ది. 16 ఎంపీ సీట్లు గెలిస్తే … కేసీఆర్ ఏం చేస్తాడని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. రెండు ఎంపీ సీట్లతో రాష్ర్టాన్నే సాధించాం… 16 సీట్లను గెలిస్తే అభివృద్ధిలో ముందుంటామని తెలిపారు.

Image may contain: one or more people and crowd

Image may contain: 9 people, people standing and child

Image may contain: 6 people, people smiling, people standing